భారతీయ సినిమాను ప్రపంచవేదికపై నిలిపే బ్రాండ్ అంబాసిడర్ ఇప్పుడు ప్రభాస్. తెలుగు సినిమా సంచలనాలకు కేరాఫ్ అడ్రాస్…ప్రభాస్. ఓ పదునైన కత్తి దొరికితే కోత ఎలా మొదలెడతారో…ప్రభాస్ అనే పదునైన కత్తి కోసం నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. పవర్ఫుల్ కథ, భారీ బడ్జెట్ అనుకునే దర్శకనిర్మాతలకు ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు. నిమ్మకు నీరెత్తనట్టు తాను కూల్ గా ఉంటూనే సక్సెస్ అంటే ఇది డార్లింగ్ అని చెప్పకనే చెప్తున్నాడు. అందుకే రాబోయే ఏడాదులకు తన భారీ సినిమాలతో డేట్స్ రాసిచ్చాడు.

క్లాస్, మాస్ ప్రేక్షకులని తేడా లేదు ప్రభాస్ సినిమాలకి. ఎవ్వర్రైనా దంచి కొట్టడమే. బాహుబలితో తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచపటానికి ఎగిరినట్టు…ప్రభాస్ స్టార్ డం తారాస్థాయికి చేరింది. ప్రభాస్ హీరోగా ఓ సినిమా ప్రకటిస్తే చాలు..నలుగురు కూర్చుంటే మాట్లాడుకోడానికి మంచి టాపిక్ దొరికినట్టే. అందులో తాజాగా ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే. దీంతో దేశమంతటా ప్రభాస్ అన్న పేరు మారుమోగిపోతుందంటే అది అతిశయోక్తి కాదు.

ఒక్కసారి ప్రభాస్ హీరోగా సైన్ చేసిన చిత్రాలను పరిశీలిస్తే…మరో ఐదేళ్లపాటూ ఆయనకు విశ్రాంతి లేదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. కెరీర్ లోనే అత్యంత భారీ చిత్రం ‘ఆది పురుష్’ త్వరలోనే పట్టాలెక్కనుంది. రాముడిగా ప్రభాస్ అంటూ మౌత్ టౌక్ తోనే సక్సెస్ సాధించింది ఆదిపురుష్. ఆపై వైజయంతీ బ్యానర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న చిత్రం ఉంది. నాగ్ అశ్విన్ డైరెక్టర్ , దీపికా పదుకోన్ హీరోయిన్ , అమితాబ్ బచ్చన్ స్పెషల్ రోల్ ఇన్ని ప్రత్యేకతలతో ఇదీ ఓ ట్రెండ్ సృష్టించడం ఖాయమంటున్నారు. ఇక కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న యాక్షన్ మూవీ సలార్. కేజీఎఫ్ తో వచ్చిన పేరుని ఏ మాత్రం పొగొట్టుకోకుండా ప్రభాస్ హీరోగా ఓ సంచలనానికి తెరదీయాలని నిర్ణయించుకున్నాడట ప్రశాంత్ నీల్. ఇవే కాదు ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘రాధేశ్యామ్’ కూడా భారీ బడ్జెట్ చిత్రమే.

యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో ‘రాధేశ్యామ్’ భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. అందమైన ప్రేమ కథలకు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు. అందుకే ‘రాధేశ్యామ్’లో ప్రేమ దృశ్యాలను అద్భుతంగా ఆవిష్కరించడం కోసమే కోట్లు ఖర్చు పెడుతున్నారట. కథాకథనాలకు తగ్గట్టు విజువల్ వండర్ గా రాధేశ్యామ్ ను మారుస్తున్నారు. ప్రభాస్, పూజా హెగ్దే లుక్స్ తో పాటూ సినిమా అంతా పూర్తి రిచ్ లుక్ తో కనిపిస్తుందట. ఈ సినిమాతో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకోవడం ఖాయమని భావిస్తున్నారు. వచ్చే ఏడాది రాధేశ్యామ్ థియేటర్స్ కు రానుంది. ఆ తర్వాత ఆది పురుష్, నాగ్ అశ్విన్ చిత్రం, ప్రశాంత్ నీల్ చిత్రాలు ప్రభాస్ కాంబినేషన్ లో ఒక్కొక్కటిగా రానున్నాయి. ఈలోపు ఇంకో ప్యాన్ ఇండియా చిత్రాన్ని ప్రభాస్ అంగీకరించిన ఆశ్చర్యం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *