వకీల్ సాబ్ కంప్లీట్ అయిన వెంటనే అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ పై దృష్టి పెట్ట‌నున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఈ మధ్యే అఫీషియల్ లాంఛింగ్ జరిగిన ఈ సినిమాలో రానా మరో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. రానాకు జోడీగా ఐశ్వర్య రాజేష్‌ను ఎంపిక చేసారు. ఇక పవన్ కళ్యాణ్ జంటగా సాయి పల్లవి నటించబోతుంది. ఇందులో నటించేందేందుకు ఒక్కొక్కరికి భారీగానే పారితోషికాలు ముట్టచెబుతున్నట్టు సమాచారం. పవన్ దాదాపు 50 కోట్ల వరకు తీసుకుంటుంటే.. రానా 5 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడట. ఐశ్వర్య రాజేష్ కూడా దాదాపు 60 లక్షల వరకు పారితోషికం డిమాండ్ చేయగా… మరోవైపు సాయి పల్లవి 2 కోట్లు తీసుకుంటుందనే ప్రచారం జోరందుకుంది. పాత్ర లెంత్ తక్కువే అయినా ఇందులో సాయి పల్లవి నటిస్తే సినిమాకు మరింత హైప్ వస్తుందని భావించిన నిర్మాతలు ఆమె అడిగినంత ఇస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *