అందరు హీరోలు వరుసగా సినిమాల్ని లైన్లో పెడుతున్నారు. కానీ బన్నీ మాత్రం ఇంత వరకూ నెక్ట్స్ సినిమా విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. హ్యాట్రిక్ కాంబినేషన్లో ప్రజెంట్ సుకుమార్ తో చేస్తున్న పుష్ప సినిమా 70 పర్సెంట్ కంప్లీట్ కూడా అయిపోయింది. ఇక మిగిలిన 30 పర్సెంట్ కంప్లీట్ చేసి ఆగస్ట్ కి రిలీజ్ చేసేస్తే ఇక బన్నీ ఖాళీయే. అందుకే నెక్ట్స్ సినిమా మీద ఫోకస్ చేసాడు బన్నీ.

అల్లు అర్జున్ నిజానికి కొరటాల శివతో సినిమా అనౌన్స్ చేసాడు. ఆ సినిమా నెక్ట్స్ సంక్రాంతికి రిలీజ్ అని కూడా పోస్టర్ ఇచ్చారు. కానీ అంతలోనే కొరటాల ఎన్టీఆర్ వైపు షిఫ్ట్ అవ్వడంతో ఇప్పుడు బన్నీ నెక్ట్స్ సినిమా గురించి టాపిక్ నడుస్తోంది. అయితే బన్నీ అంతకుముందే వేణుశ్రీరామ్ తో ఐకాన్ సినిమా కమిట్ అయ్యాడు. ఆల్ మోస్ట్ షూటింగ్ స్టేజ్ వరకూ వెళ్లిన ఈ సినిమా అర్దాంతరంగా ఆగిపోయింది. వకీల్ సాబ్ తో మళ్లీ బ్యాక్ బౌన్స్ అయిన వేణుతో ఐకాన్ ని స్టార్ట్ చేస్తున్నట్టు దిల్ రాజు అఫీషియల్ గానే చెప్పారు. అయితే బన్నీ మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. దిల్ రాజు కూడా హీరో ఎవరన్నది ప్రకటించలేదు.

వేణుశ్రీరామ్ తో ఐకాన్ సంగతి క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి సడెన్ గా ప్రశాంత్ నీల్ లైన్లోకి వచ్చేశారు. ప్రజెంట్ ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్న ప్రశాంత్ నీల్ డిసెంబర్ నాటికి ఈసినిమా కంప్లీట్ చేసేస్తే ఇక జనవరి నుంచి బన్నీతో సినిమాని పట్టాలెక్కించొచ్చని ప్లాన్ చేస్తున్నారట అటు బన్నీ-ప్రశాంత్ నీల్. బన్నీకి కన్నడ లో మంచి మార్కెట్, ఫాలోయింగ్ కూడా ఉండడంతో ప్యాన్ ఇండియా వర్కవుట్ అవుతుందని ప్లాన్ చేస్తున్నారు. మరి ఇన్ని ఆప్షన్స్ లో అల్లు అర్జున్ ఏ డైరెక్టర్ తో తన నెక్ట్స్ సినిమా అనౌన్స్ చేస్తాడో అని ఎదరుచూస్తున్నారు ఫ్యాన్స్ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *