వకీల్ సాబ్ మూవీ ఏప్రిల్ 23న అమెజాన్ ఓటీటీలో రిలీజ్ కానుందనే ప్రచారం నడుస్తోంది. గత శుక్రవారమే రిలీజై కమర్షియల్ సక్సెస్ సాధించిన వకీల్ సాబ్…అప్పుడే ఓటీటీలోకి వస్తుందనే ప్రచారం జరుగుతుండటంతో షాకయ్యారు అభిమానులు. అయితే ఇంతత్వరగా స్ట్రీమింగ్ చేసేందుకు దిల్ రాజు అగ్రిమెంట్ చేసుండరనే టాక్ మరోవైపు వినిపిస్తోంది. కానీ ఎప్పుడో అమెజాన్ ప్రైమ్ తో డీల్ కుదుర్చుకున్న దిల్ రాజు ఓటీటీలో రిలీజ్ చేయకతప్పదని మరికొందకు కామెంట్ చేస్తున్నారు. మరీ ఈ విషయం నిజమో, కాదో తెలియాలంటే వకీల్ సాబ్ టీమ్ అధికారికంగా ప్రకటించాలి.

ఇక కొంత పాజిటివ్ టాక్ వచ్చినా సక్సెస్ రుచిని పెద్దగా ఆస్వాదించలేకపోయిన నాగార్జున వైల్డ్ డాగ్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. మే రెండో వారం నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. నిజానికి వైల్డ్ డాగ్ ఓటీటీలోనే డైరెక్ట్ విడుదలకావాల్సింది. కానీ జాతిరత్నాలు, ఉప్పెన హిట్ చూసాక అదృష్టాన్ని పరీక్షించాలనుకున్నారు నాగార్జున. అందుకే థియేట్రికల్ రిలీజ్ కి ఇంట్రెస్ట్ చూపించి రిలీజ్ చేసారు. కానీ పెద్దగా ఆడకపోయే సరికి త్వరలోనే నెట్ ఫ్లిక్స్ వేదికగా ప్రదర్శించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *