కొందరు కలుసుకోవాలంటే కాలం వెంటనే అనుకూలించదు ,ఏవేవో అవాంతరాలు తెచ్చిపెడుతుంది ….. కానీ కాలం ఒకసారి వాలని కలపడం మొదలుపెడితే ఆ బంధం చరిత్రను తిరగరాసే అంత బలంగా ఉంటుంది…..
దీనికి బలమైన ఉదాహరణ ప్రభాస్ రాజమౌళి ల బంధం, అదే ప్రభాస్ ఈశ్వర్ ఫిలిం చేస్తున్న టైంలో రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ చేసి ఖాళీగా ఉన్నాడు. ప్రభాస్ తో సినిమా చేయాలని రాజమౌళి ఉబలాట పడ్డాడు ,కాని కుదరలేదు . సింహాద్రి తర్వాత కూడా ట్రై చేశాడు, అప్పుడు కుదరలేదు. ఈసారి మాత్రం రాజమౌళి బలంగా సంకల్పెంచుకున్నాడు ,అటుపక్క ప్రభాస్ కూడా అంతే . ఈసారి వీళ్ళని ఆ ప్రసక్తి లేనే లేదు కీరవాణి ఫ్యామిలీ కి భోగవల్లి ప్రసాద్ చాలా క్లోజ్, సినిమాలకు అతీతమైన బంధం వాళ్ళది ,భోగవల్లి ప్రసాద్ ఏ సినిమా చేసినా దాదాపుగా కీరవాణి మ్యూజిక్ అందించారు. తన ముందు ఎదిగిన రాజమౌళి ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ కావడం చూసి భోగవల్లి ప్రసాద్ చాలా ఆనంద పడిపోయాడు .రాజమౌళితో సినిమా చేయాలని ముచ్చటపడ్డారు. రాజమౌళి కూడా ఓకే చెప్పేసాడు. ఎంత బడ్జెట్ అయినా పర్వాలేదు అని చెప్పేశారు ప్రసాద్.
రాజమౌళి బరువైన బాధ్యతతో ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నాడు. ప్రభాస్ సినిమాలని వరుసబెట్టి చూస్తున్నాడు రాజమౌళి ఏ హీరోతో సినిమా చేసినా ఆ హీరో అంతకు ముందు చేసిన సినిమాలన్నీ చూసి పాత్రల తీరు వాటిలో ఆడియన్స్ కి ఏవి నచ్చాయి అనేది చూసి రీసెర్చ్ చేయడం రాజమౌళికి ఆనవాయితి. బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన అడవి రాముడు లో బర్త్ డే సీన్ లో ఆర్తి అగర్వాల్ తో చేసిన నటన రాజమౌళికి విపరీతంగా నచ్చింది. చేస్తే ఇతనితో హైలెవెల్ ఎమోషనల్ డ్రామా చేద్దామని రాజమౌళి బలంగా ఫిక్స్ అయ్యారు .నాన్న విజయేంద్రప్రసాద్ తొ కూర్చున్నారు రాజమౌళి .ఈ పదేళ్లలో తల్లీ కొడుకుల మధ్య సెంటిమెంట్ సినిమా రాలేదు .ఆ ప్యాట్రన్ లో మంచి కథ కావాలి నాన్న అని అడిగాడు రాజమౌళి .ఆయనకు వెంటనే చత్రపతి సబ్జెక్టు గుర్తుకొచ్చింది .. తాను రాసుకున్న చత్రపతి కథను చెప్పాడు . రాజమౌళి చత్రపతి కథ విపరీతంగా నచ్చేసింది .ప్రభాస్ ఇమేజ్కు తగ్గట్టుగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నాడు రాజమౌళి .ఏ కథ చేసిన అందులో సూపర్ హీరోయిజం ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో కూడా బాగా వర్కౌట్ అయింది ,అలాగే కామెడీ కూడా బాగా రావాలని రాజమౌళి తపన, శంకర్ సినిమా అపరిచితుడు అప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది ,దానికి ప్యారడీ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు. కో-డైరెక్టర్ కర్ణం దానికి సై అన్నారు, అంత బాగా వచ్చింది అంతే స్క్రిప్ట్ లాక్ ఎన్ రత్నం తో డైలాగులు రాయించారు, హీరోయిన్గా శ్రీయ, మెయిన్ విలన్గా సై ఫ్రేమ్ ప్రదీప్ రావత్ ,ఓకే ఇంకో విలన్ కావాలి. సై లో మొదటి విలన్ గా అనుకున్న నరేంద్ర గుర్తొచ్చాడు. బాజీరావు గా అతడు ఖరార్. కాట్రాజు గా సుప్రీత్ సెలెక్ట్ అయ్యాడు. తల్లి పాత్రకు బానుప్రియ ఓకే చెప్పేశారు .ప్రభాస్ బ్రదర్ గా షఫీ ని ఫిక్స్ చేశారు .సై కీ పని చేసిన సెంథిల్ కి కెమెరామెన్ పోస్ట్ .అన్నిటికీ మించి పెద్దన్న కీరవాణి తన పాటలతో సిద్ధంగా ఉన్నాడు .పీటర్ హేన్స్ హాలీవుడ్ స్థాయిలో ఫైట్లు డిజైన్ చేస్తున్నారు….
షూటింగ్ మొదలైంది చకచక సినిమాని తెరకెక్కించారు 1.6 లక్షల అడుగుల ఫొటోస్ వచ్చింది. దాన్ని 15 వేల అడుగులకు కట్ చేశారు. ఫైనల్ దర్శన కీరవాణి చేతిలో పెట్టారు. ఆయన ఈ సినిమా మూడ్ ని ఎలివేట్ చేస్తూ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని అందించారు. అదిరిపోయింది .సినిమా లెవెల్ మారిపోయింది .బడ్జెట్ 12.5 కోట్లు అయింది. అయినా సినిమా మీద నమ్మకంతో భోగవల్లి ప్రసాద్ సొంతంగా రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు ,కానీ మంచి ఆఫర్లు రావడంతో రెండు ఏరియాలు ఉంచుకొని మిగతా అన్ని అమ్మేశారు.
2005 సెప్టెంబర్ 30 విడుదలైన చత్రపతి కి ఫస్ట్ డే డివైడ్ టాక్ . కానీ రాజమౌళి మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు.
చత్రపతి సినిమా స్లో పాయిజన్ లా జనాలందరికీ ఎక్కేసింది .

తనకోసం తాను బతికేవాడు మనిషి జనాల కోసం బతికే వాడు చత్రపతి అనే బేసిక్ థీమ్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది

54 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది
ప్రభాస్ రేంజ్ ఈ ఒక్క అడుగుతో కొత్త శిఖరాలను చూసింది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *