రాజమౌళి, ఎన్టీఆర్ కాంబో మూవీ యమదొంగ ఫేం హీరోయిన్ మమతా మోహన్ దాస్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘లాల్ బాగ్’. ఐటి బ్యాక్ డ్రాప్ లో సాగే థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కింది ఈ సినిమా. సంపత్ కుమార్ సమర్పణలో సెలెబ్స్ అండ్ రెడ్ కార్పెట్ బ్యానర్ పై రాజ్ జకారియా ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ మూవీ తెలుగు టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను మే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
చాలా రోజుల తర్వాత మమతామోహన్ దాస్ ఓ బలమైన పాత్రలో కనిపించబోతోంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే అంశాలతో వస్తోన్న ఈ మూవీలో మమతా మోహన్ దాస్ తో పాటు నందినిరాయ్, సిజోయ్ వర్ఘిస్, రాహుల్ దేవ్ శెట్టి(బాలీవుడ్ యాక్టర్), రాహుల్ మాధవ్, అజిత్ కోషీ ఇతర కీలక పాత్రల్లో నటించారు. సంగీతం రాహుల్ రాజ్ అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *