విక్టరీ వెంకటేశ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు మల్టీస్టారర్ ‘సీతమ్మ వాకిట్లో…సిరిమల్లె చెట్టు’ 8సంవత్సరాలను పూర్తి చేసుకుంది. మల్టీస్టారర్ సినిమాల వైపు హీరోలు చూసేలా చేసిందీ సినిమా. నిజానికి ఈ సినిమా తర్వాతే మల్టీ హీరోల ట్రెండ్ పెరిగింది. వెంకీ, మహేశ్ లతో పాటూ అంజలి, సమంతా, ప్రకాశ్ రాజ్, జయసుధ, అభినయ, రావు రమేశ్…ఇలా భారీ కాస్టింగ్ సెట్ చేసి శ్రీకాంత్ అడ్డాల చేసిన ఫ్యామిలీ ప్రయోగం సక్సెసైంది.
మిక్కి జే మేయర్ అందించిన సంగీతం సీతమ్మకు కలిసొచ్చింది. పాటలు కూడా సూపర్ హిట్. డైలాగ్స్ కట్టిపడేస్తాయి. ఇప్పటికీ ఈ మూవీ వస్తుందంటే టీవీలకు అతుక్కుపోయేవారున్నారు. చిన్నోడా, పెద్దోడా అనుకునే అన్నదమ్ములు… వాళ్ల తల్లిదండ్రలు, మరదళ్ళు, మామలు…ఇలా ఫ్యామిలీ ఎమోషన్స్ ను బాగా క్యాచ్ చేసారు శ్రీకాంత్ అడ్డాల. ఆంధ్ర అందాలతో పాటూ అక్కడి మమకారాన్ని, గడుసుతనాన్ని ఒడిసిపట్టారు కాబట్టే ఎవర్ గ్రీన్ గా నిలిచింది ‘సీతమ్మ వాకిట్లో..సిరిమల్లె చెట్టు’.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *