బన్నీ – వేణు శ్రీరామ్ ఐకాన్ మూవీ మీటింగ్స్ షూరూ అయ్యాయి. ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా బన్నీతో సినిమాను మొదలుపెడతారట వేణు శ్రీరామ్. వకీల్ సాబ్ హిట్ తో మంచి పేరు తెచ్చుకున్న వేణు ఇక ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా టాలీవుడ్ మీద దండయాత్ర చేసేందుకు రెడీఅయ్యాడు.

దీంతో బన్నీ – కొరటాల ప్రాజెక్ట్ కి ప్రస్తుతానికి బ్రేక్ పడింది. అల్లు అర్జున్ – వేణు శ్రీరామ్ కలిసి సినిమా చేస్తుండటంతో కొరటాల – ఎన్టీఆర్ కాంబినేషన్ పట్టాలెక్కనుందని సమాచారం. ఎన్టీఆర్, కొరటాలతో జట్టుకట్టడంతో త్రివిక్రమ్ సినిమా వెయిటింగ్ లిస్ట్ లో పడింది.

కొరటాల శివ – ఎన్టీఆర్, బన్నీ – వేణు శ్రీరామ్…ఇలా మ్యూచువల్ అడ్జస్ట్మెంట్స్ జరగడంతో ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబో ప్రస్తుతానికి ఆగింది. దీంతో మహేశ్ బాబుతో ఓ మూవీని పట్టాలెక్కించనున్నారు త్రివిక్రమ్. రాజమౌళితో మహేశ్ చేసే సినిమాకు కాస్త టైం దొరకడంతో సర్కారు వారి పాట తర్వాత మహేశ్, త్రివిక్రమ్ కాంబో మూవీ రానుందనే టాక్ వినిపిస్తోంది.

ఎన్టీఆర్30 సినిమా గురించి ఇలా రోజుకో వార్త వస్తుండటంతో క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు నిర్మాత మహేశ్ కోనేరు. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లతో క్లోజ్ గా ఉండే మహేశ్ కోనేరు…తాజాగా ఎన్టీఆర్ 30కి సంబంధించిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తానని ట్వీట్ చేసారు. సో మరికొద్ది సేపట్లోనే ఈ ట్విస్ట్ లు అన్నింటికి చెక్ పడనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *