సాయి పల్లవి అంటే…సాయిపల్లవి ఉంటే సినిమాకిప్పుడు యమా క్రేజ్. ఈ నెలలో రెండువారాల తేడాతో ఆమె రెండు సినిమాలు రాబోతున్నాయి. ఏప్రిల్16న లవ్ స్టోరీ, ఏప్రిల్ 30న విరాటపర్వం రిలీజ్ కి రెడీఅయ్యాయి. అయితే తాజాగా నితిన్ సరసన సాయి పల్లవి కనిపించనుందనే వార్త హల్చల్ చేస్తోంది. ప్రముఖ రచయిత, డైరెక్టర్ వక్కంతం వంశీ కాంబోలో ఈ సినిమా రానుందని సమాచారం. వంశీ చెప్పిన కథ నచ్చడంతో నితిన్ తో జోడీ కట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట సాయి పల్లవి.

వక్కంతం వంశీ ఈ సినిమాకు కేవలం కథను మాత్రమే అందిస్తారా…లేదంటే దర్శకత్వం కూడా వహిస్తారా అన్నది తెలియాల్సిఉంది. గతంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన నా పేరు సూర్య…నా ఇల్లు ఇండియా చిత్రంతో దర్శకుడిగా మారారు వక్కంతం వంశీ. రచయితగా కిక్, ఊసరవెల్లి, ఎవడు, రేసుగుర్రం, టెంపర్ వంటి చిత్రాలున్నాయి ఆయన ఖాతాలో. మరి వక్కంతం వంశీతో కలిసి నితిన్, సాయి పల్లవి కలిసి వస్తారా…లేదా అన్నది మరికొన్ని రోజుల్లోనే తెలియనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *