పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌కు జంటగా పూజా హెగ్డే కనిపించడం దాదాపు ఖాయమైనట్టేనని తెలుస్తోంది. హరీశ్‌ శంకర్‌ డైరెక్షన్ లో పవన్‌ కల్యాణ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రొడక్షన్ హౌజ్ ఓ సినిమాను నిర్మించనుంది. ఇందులో పూజాను ఫైనల్ చేసారని టాక్. తాజాగా ఆమెకు లుక్‌ టెస్ట్‌ కూడా చేసారు. హరీష్ శంకర్, పవన్ కాంబో మూవీలో అనుకున్న లుక్‌ను ఓకే చేసారట. అయితే మెగాఫ్యామిలీలో ఇంతవరకూ పవన్‌తో నటించలేదు పూజా హెగ్డే. పవన్, పూజా కాంబినేషన్‌లో మొదటి సినిమా ఇది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కించే సీన్స్ కూడా చాలా కొత్తగా ఉంటాయని, ఈ సినిమాకు ఇవే కీలకమని చెప్తున్నారు.

మరోవైపు… హరీశ్‌ శంకర్‌, పూజా హెగ్డే కాంబోలో వస్తోన్న మూడో చిత్రమిది. మునుపు ఆయన డైరెక్ట్ చేసిన దువ్వాడ జగన్నాథమ్‌, గద్దలకొండ గణేష్‌ సినిమాల్లో ఆమె నటించారు. ఆ రెండు కూడా మెగా హీరోల సినిమాలే. ప్రస్తుతం పవన్‌ నటిస్తోన్న ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రీమేక్‌, ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్స్ తర్వాత హరీష్ శంకర్ సినిమా ప్రారంభం కానుంది. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్, పవన్ కలయిక రిపీట్ కానుండటంతో సినిమాపై బాగానే అంచనాలున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *