సుకుమార్, బన్నీ కాంబో పుష్ప నుంచి ప్రీల్యూడ్ ఆఫ్ పుష్పరాజ్ అంటూ చిన్న వీడియో రిలీజ్ చేసారు. ఏప్రిల్ 7వ తేదీ సాయంత్రం 6గంటల 12నిమిషాలకు పుష్పరాజ్ కి సంబంధించిన మొత్తం వీడియో రిలీజ్ చేయనున్నారు. ఇప్పడు రిలీజ్ చేసిన వీడియోలో కట్టేసిఉన్న చేతులతో అడవిలోకి పారిపోతున్నాడు అల్లు అర్జున్. ఇంప్రెసివ్ గా అనిపించింది లుక్. దేవీశ్రీప్రసాద్ సంగీతం హైలైట్ కానుందని ఈ చిన్న బిట్ చూస్తే అర్ధమవుతుంది. ఇక ఏప్రిల్ 7 న రిలీజయ్యే టోటల్ వీడియోతో యూట్యూబ్ రికార్డ్ ఖాయంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం హైదరాబాద్ టోలిచౌకిలో షూటింగ్ జరుపుకుంటోంది పుష్ప సినిమా. బన్నీపై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో ఆగస్టు 13న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే హీరోయిన్ రష్మికకు సంబంధించిన షూట్ కూడా కొంత పూర్తయింది. ఇంకో రెండు, మూడు షెడ్యూల్లలో పుష్ప షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఆపై పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీకానున్నారు డైరెక్టర్ సుకుమార్. ఇక ఇప్పటినుంచే ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేందుకు ట్రై చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *