చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి ‘జాంబీరెడ్డి’ సినిమాతో హీరోగా ఎదిగాడు తేజా సజ్జా. హీరోగా తన రెండో సినిమా ఇష్క్ ఈ నెల 23న థియేటర్స్ కి రానుంది. ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ అన్న ట్యాగ్ లైన్ తో సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉండబోతుందనే విషయం తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ తేజ సరసన నటించిన ఈ సినిమాను ఎస్ఎస్ రాజు డైరెక్ట్ చేసాడు. కాగా ఈ మూవీ ట్రైలర్‌ను సుప్రీమ్ హీరో సాయిధరమ్‌ తేజ్‌ విడుదల చేసారు.

లవ్ కపుల్ గా కనిపిస్తోన్న తేజ, ప్రియా జంట కారు ప్రయాణం ఎలాంటి మలుపులు తిరిగింది? వీరిపై దాడి చేసిందెవరు? ఎందుకు అన్న ప్రశ్నలు ట్రైలర్ తో రేకెత్తించారు. ఈ సినిమాని మెగా సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ నిర్మిస్తోంది. నిర్మాత ఆర్‌.బి చౌదరి సమర్పణలో ఎన్వీప్రసాద్, వాకాడ అంజన్‌ కుమార్, పరాస్‌జైన్‌ నిర్మాతలు. సినిమాటోగ్రఫీ శ్యామ్‌ కె నాయుడు అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *