సూపర్‌ స్టార్‌ – మాటల మాంత్రికుడి కాంబినేషన్‌ మరోసార రిపీట్ కానుంది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్ తో ఓ సినిమా చేయనున్నట్లు మహేశ్‌ బాబు ఇప్పటికే కొన్న సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే ప్రజెంట్ మహేశ్‌ సర్కారు వారి పాటతో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ తర్వాత దర్శక ధీర రాజమౌళితో సినిమా చేయాల్సి ఉంది. కానీ తాజా సమాచారం ప్రకారం బాబు.. రాజమౌళి కాంబో కంటే ముందు త్రివిక్రమ కలయికలో ఓ సినిమాను పట్టాలెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ28’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో త్రివిక్రమ్ ఈ సినిమా తెరకెక్కించేందుకు సిద్ధం అయ్యారట. దీంతో సూపర స్టార్ అభిమానులు ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ28’ అనే హ్యాష్‌ ట్యాగ్‌ను సోషల్‌ మీడియా వేదికగా ట్రెండ్‌ క్రియేట్ చేస్తున్నారు.

2021 నవంబర్‌ లేదంటే డిసెంబర్‌ నెలలోనే ఈ కాంబో మూవీ షూటింగ్‌ ప్రారంభిస్తారట. మహర్షిలో మహేశ్ సరసన నటించిన బుట్టబోమ్మ పూజాహెగ్దే మరోసారి మహేశ్ తో జతకట్టబోతుంది. జీఎమ్‌ బెంటస్‌, హారిక హాసిని క్రియేషన్స్‌ కలిసి నిర్మించబోతున్న ఈ సినిమాకి తమన్‌ సంగీతం అందించనున్నాడని అంటున్నారు. అయితే త్రివిక్రమ్‌ శ్రీనివాస్, జూనియర్‌ ఎన్టీఆర్‌ కాంబినేషన్ లో సినిమా రానున్నట్టు ఈమధ్య వరుస కథనాలు వచ్చాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్ వాయిదా పడినట్లు న్యూస్ హైప్ అవగా ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ న్యూస్ నిజం కాదంటూ ట్వీట్‌ చేసాడు. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం ‌‘ఎన్టీఆర్‌30’ ప్రాజెక్ట్ కు కాస్త విరామం ఇచ్చి ముందు మహేశ్‌ బాబు ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 28’ సినిమాని తెరపైకి తీసుకొస్తారని మాత్రం గుసగుసలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *