లాస్ట్ ఇయర్ ఇదే టైమ్ కి స్టార్ట్ అయ్యి కరోనా ఎఫెక్ట్ తగ్గిందనుకున్నా..కాస్త బ్రేక్ ఇచ్చి ఇంకా ఎక్కువవుతోంది. కరోనా తో సినిమా ఇండస్ట్రీ లాస్ లోనుంచి ఇప్పుడిప్పుడే బయటికొస్తోందనుకుంటే .. మళ్లీ కేసులు పెరగడంతో స్టార్లు కూడా ఇబ్బందిపడుతున్నారు. లేటెస్ట్ గా ఆలియా భట్ కి కరోనా పాజిటివ్ రావడంతో ఇటు ట్రిపుల్ ఆర్ తో పాటు ఆల్రెడీ షూటింగ్ స్టేజ్ లో ఉన్న బాలీవుడ్ సినిమాలు కూడా షెడ్యూల్ మార్చుకోవాల్సి వస్తోంది.

కేసులు ఎక్కువవడంతో షూటింగ్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతోంది. ప్రభాస్ , కృతి సనన్ సీతారాముల్లా నటిస్తున్న ఆదిపురుష్ కి కూడా ఇబ్బందులు తప్పడం లేదు . భారీ స్టార్ కాస్ట్, బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మైథలాజికల్ మూవీ షూటింగ్ ని 25 మంది తోనే చెయ్యాలని రూల్స్ పెట్టుకున్నారు యూనిట్ .

ఆఖరికి సినిమా ఫంక్షన్ల మీద కూడా కరోనా ఎఫెక్ట్ చూపిస్తోంది. ఆడియో ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లు లాంటివి రిస్ట్రిక్ట్ చేస్తున్నారు మేకర్స్ . లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ మూవీ కి సంబందించి ఫంక్షన్ మీద ఇంకా క్లారిటీ రాలేదు. అనవసరంగా జనాన్ని గేదర్ చేసి ప్రాణాల్ని రిస్క్ లో పెట్టడం ఎందుకంటూ వెనకడుగు వేస్తున్నారు మేకర్స్.

ఇక సినిమా రిలీజ్ మీద కూడా అంతే . కోవిడ్ తో సినిమాలు కూడా పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. లాస్ట్ వీక్ రిలీజ్ అవ్వాల్సిన రానా హాథీ మేరా సాథీ సినిమా కోవిడ్ భయానికి పోస్ట్ పోన్ చేశారు . ఇప్పటికే ఏప్రిల్ లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సూర్యవంశీ కూడా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేసుకునే ఆలోచనలో ఉంది. ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు కూడా కరోనా పెరగడంతో అనౌన్స్ చేసిన డేట్ కి సినిమాలు రిలీజ్ చేద్దామా..ఆగుదామా అంటూ బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *