మొత్తానికి అన్న మాట నిలబెట్టుకుంటున్నాడు మోస్ట్ వాంటెడ్ భాయ్. సల్మాన్ ఖాన్ వాంటెడ్ మూవీ కి అనఫీషియల్ సీక్వెల్ గా తెరకెక్కిన రాధే మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రతి రంజాన్ పండుగకి తన సినిమా రిలీజ్ చేసి జోష్ పెంచే సల్మాన్ ..లాస్ట్ ఇయర్ మిస్ అయినా ఈ సారి మాత్రం డబుల్ యాక్షన్ పవర్ ప్యాక్డ్ రోలర్ కోస్టర్ రైడ్ ని రెడీ చేస్తున్నారు.

దబాంగ్ 3 హిట్ తర్వాత ప్రభుదేవాతోనే రాధే సినిమా కమిట్ అయ్యారు సల్మాన్. దిశా పటానీ జంటగా చేసిన్న ఈ సినిమా హై ఓల్టేజ్ యాక్షన్ తో తెరకెక్కి ఆడియన్స్ లో ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసింది. ప్రతి సంవత్సరం ఈద్ కి కంపల్సరీగా సినిమా రిలీజ్ చేసే సల్మాన్ లాస్ట్ ఇయర్ కోవిడ్ తో మిస్ అయ్యారు . అందుకే ఈ సంవత్సరం రాధే తో డబుల్ యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ ఇస్తానంటున్నారు సల్మాన్ ఖాన్ .

సల్మాన్ ఖాన్ హీరోగా సిజిలింగ్ బ్యూటీ దిశా పఠానీ హీరోయిన్ గా , రణదీప్ హుడా విలన్ గా తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ప్రభుదేవా డైరెక్షన్లో ఈ రంజాన్ మే 13 న రిలీజ్ కు రెడీ అవుతోంది. రాధే నిజానికి లాస్ట్ ఇయర్ రంజాన్ కే రిలీజ్ ప్లాన్ చేసినా లాక్ డౌన్ లో అది కుదరలేదు . అయితే ఈ సంవత్సరం కూడా కోవిడ్ సెకండ్ వేవ్ తో రిలీజ్ కష్టమనుకున్నారు కానీ సల్మాన్ మాత్రం సినిమాని మే 13నే అటు ధియేటర్లో, ఇటు పే పర్ వ్యూ పద్ధతిలో డిష్ టీవీ, టాటా స్కై, డి టు హెట్, జీ ప్లెక్స్, ఎయిర్ టెల్ డిజిటల్ వంటి వాటిలో రిలీజ్ కానుంది.

సల్మాన్ సినిమా ..ఆపై సౌత్ డైరెక్టర్ ప్రభుదేవా కాంబినేషన్ ..మరి ఈ క్రేజీ కాంబినేషన్ కి సౌత్ టచ్ లేకుండా ఎలా ఉ:టుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ లో ప్రభుదేవా-సల్మాన్ కాంబినేషన్ లో ఫస్ట్ వచ్చిన వాంటెడ్ మూవీ క్రేజీ డైలాగ్ వాడేశారు . అంతే కాదు .. సల్మాన్ కి కూడా సౌత్ మీద ఇంట్రస్ట్ ఉండడంతో తెలుగులో సూపర్ హిట్ అయిన డిజె మూవీ లో బన్నీ సీటీమార్ సాంగ్ మీద మనసు పడ్డారు.

తెలుగులో సూపర్ హిట్ అయిన సీటీ మార్ సాంగ్ ని సల్మాన్ ఖాన్ తన రాదే సినిమాలో వాడేసుకున్నారు. బాలీవుడ్ వెళ్లినా, ఏ స్టార్ హీరోతో సినిమా చేసినా, సౌత్ టచ్ , ఫ్లేవర్ తోనే సినిమాలు కంటిన్యూ చేస్తున్న ప్రభుదేవా .. సీటీ మార్ సాంగ్ తో సల్మాన్ చేత స్టెప్పులేయించి ఇటు సౌత్ ఆడియన్స్ ని కూడా ఫిదా చేశారు. సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ కి ముందే ప్రామిస్ చేసినట్టు ..ఫుల్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ని ఈద్ కి థియేటర్లోకి తీసుకొస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *