కెరీర్ స్టార్టింగ్ లో ఎవరూ పెద్దగా పట్టించుకోకపోయినా .. ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా తన టైమ్ కోసం వెయిట్ చేసింది పూజాహెగ్డే . దెబ్బకి బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ తో అందరి స్టార్ హీరోల సరసన నటిస్తూ..స్టార్ హీరోయిన్ అయిపోయింది. అందుకే ఫ్యాన్స్ కూడా అంతలా పెరిగిపోయారు సోషల్ మీడియాలో . మరి హీరోయిన్స్ లో టాప్ నంబర్ ఫాలోయింగ్ తో థర్డ్ ప్లేస్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మని ఎంత మంది ఫాలో అవుతున్నారో తెలుసా..?

తెలుగులో ఎన్టీఆర్ తో అరవిందసమేత చేసి బంపర్ హిట్ కొట్టిన పూజా..మహేష్ తో మహర్షి సినిమా చేసింది. బన్నీతో అలవైకుంఠపురంలో సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది పూజాహెగ్డే. ఈ సక్సెస్ లతోనే ఆడియన్స్ కి ఇంకా క్లోజ్ అయ్యింది ఈ బుట్టబొమ్మ. సినిమాలతోనే కాదు .. సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇచ్చే ఈ ముద్దుగమ్మ ఇప్పుడు కోటి 30 లక్షల మంది ఫాలోవర్స్ తో టాప్ త్రీ ప్లేస్ ని కొట్టేసింది.

మొన్న మొన్నటి వరకూ సౌత్ లో సమంత, రష్మి, తమన్నా ఈ రేంజ్ ఫాలోయింగ్ తో ముందుంటే..ఇప్పుడు తమన్నాని దాటేసి థర్డ్ ప్లేస్ లోకి వచ్చేసింది పూజాహెగ్డే. ఏ షూట్ కి వెళ్లినా , సెట్ కి వెళ్లినా,, అసలు షూటింగ్ లేకుండా ఇంట్లో ఉన్నా లేక డిన్నర్ కో , రెస్టారెంట్ కో వెళ్లినా..ఇలా ఏం చేసినా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేస్తుంది పూజాహెగ్డే .

తెలుగు, హిందీ, తమిళ్ ఇలా సౌత్ తో పాటు నార్త్ లో కూడా సినిమాలతో దున్నేస్తున్న పూజాహెగ్డే .. వరుస సక్సెస్ లతో దూసుకుపోతోంది. ఏమాత్రం యాటిట్యూడ్ చూపించకుండా సింపుల్ గా ఉండే తన నేచర్ తోనే ఆడియన్స్ ని కోట్లలో సంపాదించుకుంటోంది ఈ పొడుగు కాళ్ల భామ. ప్రభాస్ తో రాధేశ్యామ్ సినిమాతో పాటు అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాల రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *