వరుణ్ తేజ్ కు సాయిపల్లవినిచ్చి పెళ్లి చేస్తారా అంటూ ఓ అభిమాని మెగా బ్రదర్ నాగబాబుకు షాక్ ఇచ్చాడు. జోడీ బాగుంటుంది సార్ వీళ్లిద్దరికి పెళ్లి చేసేయండి అంటూ నాగబాబు ఫ్యాన్స్ తో సోషల్ మీడియా లైవ్ చేస్తున్నప్పుడు కామెంట్ చేశాడు. నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఫన్నీ ఆన్సర్ ఇచ్చారు నాగబాబు..వరుణ్ తేజ్ పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు, జాతిర్నాలు క్లైమాక్స్ లో జడ్జిమెంట్ మీరే ఇచ్చుకోండిరా.. ఇక మేమెందుకు అన్న డైలాగ్ వీడియోను పోస్ట్ చేశారు మెగా బ్రదర్…

వరుణ్ పెళ్లికి సంబంధించిన వార్తలు గత కొంతకాలంగ ప్రచారంలో ఉన్నాయి. ఓ సందర్భంలో వరుణ్ తేజ్ కి పెళ్లి సంబంధాలు చూస్తున్నామని చెప్పారు నాగబాబు. అలాగే వరుణ్…టాలీవుడ్ టాప్ హీరోయిన్ తో ప్రేమాయణం నడుపుతున్నాడనే రూమర్స్ చక్కర్లు కొట్టాయి. ఆ హీరోయిన్ సాయిపల్లవే అన్న కామెంట్స్ చేసారు కొంతమంది. ఇప్పుడిలా ఏకంగా నాగబాబునే ప్రశ్నించారు నెటిజన్స్. అయితే వరుణ్ తండ్రి మాత్రం కామెడీగా తీసుకొని ఫన్నీ రిప్లై ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *