కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న కారణంగా విరాటపర్వం వాయిదాపడింది. రానా, సాయిపల్లవి జంటగా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. పీరియాడికల్ ఫిల్మ్ గా వేణు ఊడుగుల డైరెక్ట్ చేసిన విరాటపర్వం నిజానికి ఏప్రిల్ 30న విడుదలకావాల్సిఉంది. కానీ కొవిడ్ కేసులు అత్యంత ఎక్కువగా నమోదవుతున్న కారణంగా ప్రభుత్వం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. అందులోనూ ప్రజలు కూడా అప్రమత్తమవుతున్నారు. ఇక సినిమా పేరుతో ప్రేక్షకులను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక వాయిదా నిర్ణయం తీసుకుంది విరాటపర్వం యూనిట్.

వకీల్ సాబ్ తర్వాత రిలీజ్ కావాల్సిన లవ్ స్టోరీ ముందు పోస్ట్ పన్ అయింది. ఆ తర్వాత నాని సరదాగా మేము చెప్పిన డేట్ కి రావడంలేదంటూ వీడియో రిలీజ్ చేసారు. ఏప్రిల్ 23న రావాల్సిన టక్ జగదీష్ అర్ధాంతరంగా ఆగిపోయాడు. ఇప్పుడు విరాటపర్వం ఆ లైన్ లో చేరింది. ముందు ముందు ఈ వరుసలోకి ఆచార్య వంటి పెద్ద పెద్ద సినిమాలొచ్చినా ఆశ్చర్యం లేదు. అయితే లవ్ స్టోరీ, టక్ జగదీష్, విరాటపర్వం…మళ్లీ ఎలాంటి రిలీజ్ డేట్ ను ప్రకటించలేదు. కరోనా తగ్గి ఓ క్లారిటీకి వచ్చాక మాత్రమే అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *