వైష్ణవ్ తేజ్ మూడో సినిమా ప్రారంభమైంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. సాయి ధరమ్ తేజ్ క్లాప్ కొట్టి లాంఛనంగా ఈ సినిమాను ప్రారంభించారు. తమిళ్ అర్జున్ రెడ్డి డైరెక్టర్ గిరీశయ్య ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. రిలీజ్ కాని రొమాంటిక్ సినిమాతో హాట్ సెన్సేషన్ క్రియేట్ చేసిన కేతిక శర్మ వైష్ణవ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

వైష్ణవ్ తేజ్ పై శేఖర్ కమ్ముల కన్ను పడ్డట్టు తెలుస్తోంది. వైష్ణవ్ హీరోగా… ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా శేఖర్ కమ్ముల ఓ సినిమా ప్లాన్ చేసినట్టు టాక్. లవ్ స్టోరీ రిలీజ్ తర్వాత అఫీషియల్ గా ప్రకటించే ఛాన్స్ ఉందని సమాచారం. మరోవైపు వైష్ణవ్ తేజ్ ఉప్పెన 50రోజులను పూర్తి చేసుకుంది. క్రిష్ దర్శకత్వంలో రెండో సినిమా షూటింగ్ పూర్తయింది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *