నీలి నీలి ఆకాశం అంటూ ఇప్పటివరకు యూట్యూబ్ లో హల్చల్ చేస్తున్న యాంకర్ ప్రదీప్ ఇక థియేటర్స్ కి రానున్నాడు. జనవరి 29న ’30రోజుల్లో ప్రేమించటం ఎలా’నో చెప్తాడని నిర్మాతలు తాజాగా ప్రకటించారు. కొన్ని సినిమాల్లో హీరో ఫ్రెండ్ గా, అత్తారింటికి దారేది వంటి సినిమాల్లో అతిచిన్న సైలెంట్ రోల్స్ చేసిన ప్రదీప్ హీరోగా కనిపిస్తున్న తొలి సినిమా ఇది. ఆర్య 2, నేనొక్కడినే సినిమాలకు సుకుమార్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్ చేసిన మున్నా దీనికి డైరెక్టర్. అమృతా అయ్యర్‌ హీరోయిన్‌. ఈ మూవీలోని నీలి నీలి ఆకాశం.. సాంగ్‌ ఎంతోమంది ఆడియెన్స్ సెల్‌ఫోన్లలో ఇప్పటికీ మారుమోగుతూనే ఉంది. అనూప్‌ సంగీతం, చంద్రబోస్‌ రచన, సిద్‌ శ్రీరామ్ గాత్రం…కొత్త పెళ్లికూతురు సునీత సుమధర గానం.. అన్నీ కలిసి ఈ పాటను ఓ బ్లాక్‌బస్టర్‌ గా నిలిపాయి.
ప్రదీప్ లాంచింగ్ సినిమాను లాస్ట్ ఇయర్ ఉగాదికి రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ లాక్‌డౌన్‌ కారణంగా ఆగిపోయింది. ఓటీటీ ఆఫర్స్ వచ్చినా… థియేటర్లలోనే రిలీజ్ చేయాలన్న సంకల్పంతో ఇన్నాళ్లు ఎదురుచూసారు. దీంతో మొత్తానికి ఇలా రిలీజ్ ముహూర్తం ఫిక్స్‌ చేశారు. జనవరి 29న ప్రదీప్ ’30రోజుల్లో ప్రేమించటం ఎలా’ తో రానున్నాడు. మరి ఒక్క సాంగ్ తో మ్యాక్సిమం ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేసిన ప్రదీప్…పూర్తి సినిమాతో ఆకట్టుకుంటాడా? చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *