హిట్ ఫ్లాప్ అన్న లెక్క లేదు. మినిమం గ్యారంటీ హీరో నాని. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ బిజీనే. నేల విడిచి సాము చేయకుండా..మంచి కథలను ఎంచుకుని వరుస సినిమాలతో దూసుకుపోవడమే తెలుసు నానికి. ఈ హీరో కోసమే కథలు రాసే దర్శకులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. కొత్త దర్శకులందరికీ నానిని డైరెక్ట్ చేయడమే టార్గెట్. ఎందుకంటే కొత్త దర్శకులకు ఛాన్స్ ఇవ్వడంలో ముందుంటాడు నేచురల్ స్టార్. ప్రస్తుతం నాని ఇదే చేస్తున్నాడు. తాజాగా నాని నటిస్తున్న మూడు సినిమాలకు ఒకట్రెండు సినిమాల అనుభవం ఉన్న వాళ్లే. పైగా 2020లో వి సినిమాతో ప్రేక్షకులను కాస్త నిరాశ పరిచిన నాని.. వచ్చే ఏడాది దానికి ట్రిపుల్ బోనస్ ఇవ్వనున్నాడు. ఆడియెన్స్ కు భారీ ఎత్తున ఎంటర్టైన్మెంట్ బాకీని తీర్చుకునేందుకు కసరత్తులు చేస్తున్నాడు.

2021లో మూడు సినిమాలతో రాబోతున్నాడు నాని. ముందుగా టక్ జగదీష్ గా దర్శనమివ్వనున్నాడు. ఏప్రిల్ 2021లో ఈ సినిమా రిలీజ్ కానుంది. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకుడు దీనికి. నిన్నుకోరి తర్వాత మజిలితో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. నానితో రెండో సారి పని చేస్తున్నాడు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఇందులో జగదీష్ నాయుడుగా కనిపించనున్నాడు నాని. ఈ సినిమా షూట్ క్లైమాక్స్ కు చేరగానే శ్యామ్ సింగ రాయ్ సినిమాను కూడా మొదలు పెట్టాడు నాని. ఈ మధ్యే రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. 

2021 ఆగస్టులో శ్యామ్ సింగ రాయ్ విడుదల కానుంది. కోల్ కతా బ్యాక్ డ్రాప్లో సాగే ఈ చిత్రాన్ని టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంక్రీత్యన్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో సాయి పల్లవి, ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దాంతో పాటు నాని నటిస్తున్న మూడో సినిమా అంటే సుందరానికి..ఈ సినిమాకు దర్శకుడు బ్రోచేవారెవరురా, మెంటల్ మదిలో చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ. ఈ సినిమాలో నజ్రియా నజీమ్ హీరోయిన్. మొత్తానికి 2021 మూడు సీజన్స్ లో మూడు సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు నాని.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *