సరికొత్తగా…నూతన కథాంశంతో తన కెరీర్ కు ‘నాంది’ పలికారు అల్లరి నరేష్. అందుకు చేయుతనిచ్చారు సూపర్ స్టార్ మహేష్ బాబు. అవును టాలెంటెడ్ ‘విజయ్ కనకమేడల’ దర్శకత్వంలో ‘అల్లరి నరేష్’ నటించిన నాంది ట్రైలర్ ను రిలీజ్ చేసారు మహేష్ బాబు. ఈమధ్యే బంగారు బుల్లోడిగా వచ్చినా హిట్ అందుకోలేక ఇబ్బందిపడ్డారు అల్లరి నరేష్. ఇప్పుడీ ప్రయోగాత్మక చిత్రం నాంది తో హిట్ గ్యారంటీ అంటున్నారు. సన్సెన్స్, క్రైమ్ కలగలపిన థ్రిల్లింగ్ అంశాలతో కొత్త జోనర్ లో ఈ మూవీని తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది.

మంచి కథ దొరకాలే కానీ నటనతో విజృంభిస్తారన్న విషయం నేను, గమ్యం సినిమాలతో ప్రూవ్ చేసుకున్నారు అల్లరి నరేష్. మళ్లీ అలాంటి విభిన్న కథాంశాన్ని డైరెక్టర్ విజయ్ కనకమేడల అందించడంతో వాస్తవికతకు దగ్గరగా అల్లరి నరేష్ అద్దరగొడతారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ సినిమా “ఫిబ్ర‌వ‌రి 19న” ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శక‌త్వంపై కూడా మంచి అంచనాలున్నాయి. స‌తీశ్ వేగేశ్న నిర్మించిన ఈ సినిమాలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ లాయ‌ర్‌గా నటించారు. ఇటీవలే బ్లాక్ బస్చర్ క్రాక్ సినిమాతో వావ్ అనిపించిన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ ఈ సినిమాతో కూడా ఆకట్టుకునేలా కనిపిస్తున్నారు.

నాంది సినిమా ట్రైలర్‌ను శనివారం 10. 08 నిమిషాలకు విడుదల చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు… ట్విటర్‌లో ‘నాంది’ ట్రైలర్‌ రిలీజ్‌ చేస్తున్నందుకు ఆనందంగా ఉందని, మూవీ బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ కావాలని… అల్లరి నరేష్‌, మూవీయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఓ హత్య…దాని చుట్టూ అల్లుకున్న పరిణామాలు, ప్రశ్నలు, భావోద్వేగాలు అన్నింటిని ఆస్వాదించాలంటే ఫిబ్రవరి 19 వరకు వేచిచూడాల్సిందే. ఈ సందర్భంగా ఆహాచిత్రం తరపున డైరెక్టర్ విజయ్ కనకమేడల, అల్లరి నరేష్ లతో పాటూ “నాంది” చిత్రయూనిట్ కి ఆల్ ది బెస్ట్ తెలుపుతూ….అభినందనలు.

Source: Lahari Music

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *