నిశ్శబ్ధం సినిమా తర్వాత చాలా సైలంటయ్యారు అనుష్కా. వేరే సినిమాలకి కమిట్ కూడా అవలేదు. అలా అని పెళ్లి ఊసూ ఎత్తలేదు. అయితే ఆమధ్య పోలవరం గోదావరిలో పడవ ప్రయాణం చేసి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని అన్నారు. కానీ అఫీషియల్ గా ఎలాంటి న్యూస్ వినబడలేదు. కానీ ఇప్పుడు నిజంగానే అనుష్క హీరోయిన్ గా ఓ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించబోతున్నారని టాక్.
సందీప్ కిషన్ హీరోగా రారా కృష్ణయ్య మూవీని తెరకెక్కించిన పి మహేశ్ స్వీటికి ఓ కథను వినిపించారట. సరికొత్త పాయింట్ తో ఉన్న ఆ కథకి మెస్మరైజ్ అయిన అనుష్క వెంటనే ఓకే చెప్పారని సమాచారం. అందుకోసం మేక్ ఓవర్ పనిలోఉన్నారామే. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయబోతుంది. అతిత్వరలో ముహూర్తం పెట్టుకోబోతున్న ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *