ప్రముఖ సంగీత దర్శకుడు..ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ మాతృమూర్తి కరీమా బేగం కన్నుమూసారు. ఈ విషయాన్ని స్వయంగా రెహమాన్ సోషల్ మీడియా వేదికగా తెలియజేసారు. వయసురీత్యా వచ్చిన అనారోగ్యంతో ఆమె తుదిశ్వాస విడిచారు. దీంతో పలువురు రెహమాన్ కు సానుభూతి తెలుపుతున్నారు.

చిన్న వయసులోనే భర్తను పొగొట్టుకున్న ఆమె ప్రోత్సాహంతోనే రెహమాన్ ఈ స్థాయికి ఎదిగాడు. రెహమాన్ అసలు పేరు దిలీప్. తండ్రి ఆర్.కె.శేఖర్ సంగీత కళాకారుడు. రెహమాన్ నాలుగేళ్ల వయసులోనే తండ్రి దగ్గర పియానో నేర్చుకున్నాడు. అయితే అనుకోకుండా తండ్రి మరణించడంతో ముగ్గురు ఆడపిల్లలున్న కుటుంబ బాధ్యతల్ని మోయాల్సి వచ్చింది. అయితే తల్లి సహకారంతో సంగీతపై దృష్టిసారించారు రెహమాన్. 

భర్త చనిపోయాక ఆర్ధిక ఇబ్బందులు తలెత్తడంతో ఆమె సూఫీయిజం ద్వారా స్వాంతన పొందారు. ఆ విధంగా కస్తూరి అన్న తన పేరును కరీమా భేగంగా మార్చుకున్నారు. అలాగే దిలీప్ అన్న పేరు రెహమాన్ గా మారింది. సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడంటే అదంతా తన తల్లి చొరవే అంటారు ఏ ఆర్ రెహమాన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *