బాలీవుడ్ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ కరోనా బారినపడ్డారు. దీంతో ధనుష్ టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే ధనుష్, సారా అలీఖాన్ జంటగా అక్షయ్ కుమార్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ‘ఆత్రంగి రే’ మూవీని తెరెకెక్కిస్తున్నది ఆనంద్ ఎల్ రాయ్. దీంతో ఇంతకాలం ఆయనతో పనిచేసిన యూనిట్ సభ్యులందరికీ భయం పట్టుకుంది.

ముక్కోణపు ప్రేమకథగా తీస్తున్న ‘ఆత్రంగి రే’ సినిమాలో ధనుష్‌పాత్ర షూటింగ్ పూర్తి కావడంతో చిత్ర యూనిట్‌నిన్న కేక్‌కటింగ్‌చేసింది. ఈ వేడుకలో డైరెక్టర్ వెంట ధనుష్‌, సారా అలీఖాన్ కూడా ఉండటంతో వారి అభిమానులు ఆందోళన పడుతున్నారు.

ఈ ఆత్రంగి రే చిత్రంలో ధనుష్‌ఓ పాట కూడా పాడటం విశేషం. 3 నుంచి మొదలుపెడితే కొడి, మారి, మారీ 2, పటాస్, తిక్క వంటి సినిమాల్లో పాటలు పాడాడు ధనుష్. అయితే ఇప్పుడు తొలిసారి రెహమాన్‌మ్యూజిక్ డైరెక్షన్ లో పాడటం… అది కూడా హిందీ సినిమా కావడం విశేషం. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *