వర్కింగ్ టైటిల్ బీబీ3తో శరవేగంగా షూటింగ్ కానిచ్చేస్తున్నారు… నంద‌మూరి బాల‌కృష్ణ-బోయ‌పాటి శ్రీను. వీరిద్దరి కాంబినేష‌న్ మూవీకి ఇంతవరకు అధికారికంగా ఎలాంటి టైటిల్ ప్రకటించలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ స్పెషల్ కాంబో మూవీకి మోనార్క్ అనే పేరును దాదాపు ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇక ఇప్ప‌టికే రిలీజైన ఈ ప్రాజెక్ట్ ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్లకు సూపర్ రెస్పాన్స్ వ‌చ్చింది. మే 28న రిలీజ్ చేస్తున్నట్టు కూడా ప్రకటించారు మేకర్స్. అయితే బాలయ్య ఫ్యాన్స్ మాత్రం టైటిల్ ఏంటో మాకు చెప్పాలని బాగా డిమాండ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో…ఇదిలా జరుగుతుండగానే, బోయపాటి శ్రీను మోనార్క్ అనే టైటిల్‌ను ఆల్రెడీ రిజిస్ట‌ర్ చేసిన‌ట్టు వార్తలొస్తున్నాయి.

అయితే మోనార్క్ అని బోయపాటి అనుకుంటున్నప్పటికీ బాలకృష్ణ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సిఉంది. ఎన్ని ప‌వ‌ర్ఫుల్ పేర్లు తెర‌పైకొచ్చినా..మోనార్క్ అనేది మాత్రం బాల‌య్య బాడీ లాంగ్వేజ్ కు పర్ఫెక్ట్ అని మూవీ యూనిట్ అనుకుంటోందట. ప్ర‌స్తుతానికైతే డైరెక్టర్ బోయ‌పాటి ముందున్న‌ ఒకే ఒక్క ఆప్షన్ కూడా ఇదేనని చెప్పుకుంటున్నారు. మ‌రి మోనార్క్ గానే బాలకృష్ణను చూపిస్తారా….సరికొత్త టైటిల్ ను తెరపైకి తీసుకొస్తారా…ముందు ముందు తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *