జగదేకవీరుడు…అతిలోక సుందరి ఎంత పెద్ద హిట్ సాధించిందో అందరికి తెలిసిందే. 1990 మే 9న రిలీజైందీ సినిమా. చిరూకి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. ఆ తర్వాత గ్యాంగ్ లీడర్ సైతం మే 9నే విడుదలై సంచలనం సృష్టించింది. ఒక్క చిరంజీవి చిత్రాలే కాదు…ప్రేమించుకుందాం రా, మహర్షి, మహానటితో పాటూ మరిన్ని సినిమాలు సైతం ఈ తేదీనే ప్రేక్షకుల ముందుకొచ్చి చిరస్థాయిగా నిలిచిపోయే సినిమాలయ్యాయి.
అందుకే మే 9ను మరోసారి లాక్ చేసేందుకు ఫిక్స్ అయ్యారు చిరంజీవి. ఆచార్యతో అదే రోజున థియేటర్స్ కి రానున్నారట. ప్రస్తుతం చిత్రీకరణ దశలోనే ఉన్న ఈ ప్రాజెక్ట్ లో ఇంకా చరణ్ పోర్షన్, చిరూతో కాంబినేషన్ సీన్స్ కంప్లీట్ అవ్వాలి. ఆపై పోస్ట్ ప్రొడక్షన్ కి టైం పడుతుంది. సమయమైతే ఉంది. మరి ఏ అవాంతరాలు రాకుండా ఉంటే చిరూ… మే 9 కోరిక తీరుతుందా? లేదా? వెయిట్ చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *