‘ఆచార్య’ షూటింగ్‌ కోసం మారేడుమిల్లి చేరుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. బన్నీ పుష్ప షూటింగ్ జరిగిన చోటే చిరూ ఆచార్యను సైతం చిత్రీకరించనున్నారు కొరటాల శివ. తాజాగా రాజమండ్రి ఎయిర్‌ పోర్ట్ చేరుకున్న చిరంజీవికి ఘన స్వాగతం లభించింది. చిరు రాక గురించి ముందుగానే తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. భాజాభజంత్రీలు, పూలమాలలతో పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు.

‘ఆచార్య’ సంగతలా ఉంటే…చిరూ నటించబోతున్న ‘లూసిఫర్’ రీమేక్ లో మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ చక్కర్లు కొడుతుంది. ఈ ప్రాజెక్ట్ లో మెగాస్టార్ చెల్లెలి పాత్ర కోసం అనూహ్యంగా త్రిష పేరు వినిపిస్తోంది. నయన్ చేస్తుందనుకున్న మెగాస్టార్ చెల్లెలి రోల్ లో త్రిష ఫిక్సయిందని టాక్. అదే నిజమైతే స్టాలిన్ రిలీజైన 15ఏళ్ల తర్వాత చిరూ, త్రిషాలను ఒకే సినిమాలో చూడొచ్చు. నిజానికి ఆచార్యలోనే త్రిషా హీరోయిన్ గా కనిపించాల్సింది. కానీ క్రియేటివ్ డిఫరెన్స్ అని ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఇప్పుడిక చెల్లెలిగా నటించలేనని నయన్ చెప్పిన రోల్ కోసం త్రిషా డేట్స్ ఇచ్చేస్తుంది. చూద్దాం ముందు ముందు ఇంకేం జరుగబోతుందో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *