మెగాస్టార్ ఆచార్యగా వచ్చేసారు. “ఇతరుల కోసం వచ్చేవారు దైవంతో సమానం” అంటూ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో ఆచార్యను ప్రెజెంట్ చేసారు. తాజాగా రిలీజైన టీజర్ తో కుమ్మేస్తున్నారు చిరంజీవి. “పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా….అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో…”అన్న డైలాగ్ తో అద్దగరొట్టారు చిరూ. జనవరి 29న ధర్మస్థలి తలుపులు తెరుచుకుంటాయని డైరెక్టర్ కొరటాల శివ ప్రకటించినట్టు…నిజంగానే ధర్మస్థలి తలుపులు తెరుచుకొని ఠీవీగా బయటికొచ్చారు ఆచార్యగా చిరంజీవి. ఇక ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన టెంపుల్ సెట్ లో జరుగుతోంది. సిద్ధగా నటిస్తోన్న రామ్ చరణ్ పై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు కొరటాల శివ.
త్వరలోనే చరణ్ జోడీగా పూజాహెగ్దే కూడా షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. వీళ్లిద్దరి కాంబినేషన్ సీన్స్ అయ్యాక…చిరూ, చరణ్…చిరూ, చరణ్, పూజాహెగ్దే ఇలాంటి కాంబినేషన్స్ తో మరకొన్ని సీన్స్ ను ప్లాన్ చేసారు కొరటాల శివ. సోనూ సూద్ ప్రతినాయకుని పాత్రలో కనిపించనున్నారు. చిరంజీవి సరసన కాజల్ నటిస్తుండగా మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ నిర్మాణ సంస్థతో కలిసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆచార్యను నిర్మిస్తున్నారు.

Source: konidela production

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *