రీ-ఎంట్రీ  తర్వాత తనదైన స్టైల్ లో దూసుకెళ్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆరు పదుల వయసులోనూ అలవోకగా సినిమాలు ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం ‘ఆచార్య’తో బిజీగా ఉన్న చిరు.. ఈ ప్రాజెక్ట్ పూర్తవకుండానే.. మరో రెండు సినిమాలను అనౌన్స్ చేసారు. అయితే.. సినిమాలు ప్రకటిస్తున్నప్పటికీ.. అందులో హీరోయిన్లను సెట్ చేయడం అతి పెద్ద టాస్క్ గా మారింది చిత్ర యూనిట్లకి.

తాజాగా మోహన్ రాజా డైరెక్షన్లో మళయాలం రీమేక్ ‘లూసీఫర్’ కి సైన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం హీరోయిన్ వేటలో పడింది యూనిట్.  లేటెస్ట్ న్యూస్ ప్రకారం..ఇందులో చిరూకి జోడిగా స్టార్ యాక్ట్రెస్ నయనతారను ఫైనల్ చేసారట.  “సైరా” చిత్రంలో సిద్ధమ్మగా చిరంజీవి సరసన నటించిన నయన్.. మరోసారి ఆయనతో కలిసొస్తుందని అంటున్నారు. అయితే ప్రమోషన్స్ కి దూరంగా ఉండే నయన్ గురించి సైరా ప్రమోషన్స్ లో పరోక్ష వ్యాఖ్యలు చేసారు మెగాస్టార్. మరి నిజంగానే నయనతారను తీసుకునేందుకు అంగీకరించారా అన్నది తెలియాల్సిఉంది.

లూసీఫర్ రీమేక్ లో ముఖ్యమంత్రి కుమార్తెగా నయన్ కనిపించబోతున్నట్టు సమాచారం. ఈ విషయమై మూవీ యూనిట్ నయనతారని కలిసారని… లాస్ట్ అగ్రిమెంట్ మాత్రమే మిగిలుందని టాక్. పారితోషకం ఫిక్స్ అయితే.. నయనతార సైన్ చేయడమే ఆలస్యమని తెలుస్తోంది. ఇక ఈ రీమేక్ లో నటించేందుకు హీరో సత్యదేవ్ తీవ్రంగా కృషిచేస్తున్నాడు. అందుకోసమే ఈమధ్య చిరంజీవిని కలిసాడట. అయితే సత్యదేవ్ రోల్ ఇంకా ఫిక్స్ కాలేదని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *