భారీ చిత్రాల దర్శకుడు శంకర్ స్కూల్ నుంచి ఓ క్రేజీ మూవీ రానుందట. అది కూడా స్టన్నింగ్ మల్టీస్టారర్ కావడం విశేషం. రామ్ చరణ్, యష్, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో ఓ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారట శంకర్. నిజానికి ప్రస్తుతం హీరోలందరి చేతిలో రెండు, మూడు సినిమాలున్నాయి. కానీ చెర్రీ మాత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ఆచార్య’ తప్ప మరే చిత్రం అనౌన్స్ చేయలేదు. త్రిపుల్ ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ తో, ఆచార్యలో తండ్రి చిరంజీవితో కలిసి నటిస్తున్నారు.

మరి రామ్‌చరణ్‌ ఆలోచిస్తున్న తదుపరి సినిమాలేంటీ అంటే… రెండు సూపర్ ప్రాజెక్ట్స్‌ సెట్స్ పైకి తీసుకెళ్లొచ్చనే టాక్ వినిపిస్తోంది. అది మనం చెప్పుకున్నట్టు శంకర్‌ దర్శకత్వం వహించే సినిమా కాగా మరొకటి జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించే ప్రాజెక్ట్. అయితే ఈ రెండు సినిమాలు కూడా ప్యాన్ ఇండియన్ స్థాయిలో ముస్తాబవుతాయని సమాచారం. మరో విషయం ఏంటంటే…ప్రస్తుతం చెర్రీ చేస్తున్న త్రిపుల్ ఆర్, ఆచార్య రెండూ..మల్టీస్టారర్ చిత్రాలే. ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో సైతం యశ్, విజయ్‌ సేతుపతితో కలిసి నటిస్తారట. ముగ్గురు మంచి ఈజ్ ఉన్న నటులే. చూడాలి మరి మాటలవరకేనా…నిజంగానే సెట్స్ పైకెళ్తారా అన్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *