డర్టీ హరి…నిర్మాత, దర్శకుడు ఎమ్మెస్ రాజు తెరకెక్కించిన సినిమా ఇది. ఈ చిత్రాన్ని ఫ్రైడే మూవీస్ ఏటీటీ (ఎనీ టైమ్ థియేటర్)లో డిసెంబర్ 18 విడుదల చేశారు. ఆన్ లైన్ వేదికగా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభించిన కారణంగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 8న థియేటర్స్ లో విడుదల చేయనున్నారు. 

రొమాంటిక్ సస్పెన్స్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారట. శ్రవణ్ రెడ్డి, రుహానీ శర్మ, సిమ్రత్ కౌర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ బోల్డ్ రొమాన్స్ డ్రామాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని… థియేటర్ లో ఈ సినిమాను ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ చేస్తారని అనుకుంటున్నాను. కంటెంట్ బాగుంటే సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని డర్టీ హరి నిరూపించిందని ఎంఎస్ రాజు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *