ఒకే రోజు వరుసబెట్టి రిలీజ్ డేట్లను ప్రకటిస్తున్నారు దర్శకనిర్మాతలు. ఆగస్టు 2న సిటీమార్ కొడతానంటున్నారు గోపీచంద్. కబడ్డీ కోచ్ పాత్రల్లో గోపీచంద్, తమన్నా నటించారు ఈ సినిమాలో. సంపత్ నంది డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న మూవీ యూనిట్ సిటీమార్ ను ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

మొత్తానికి 2020 విషాదాన్ని మర్చిపోయి 2021లో ఫుల్ జోష్ నింపేలా తలపిస్తుంది వాతావరణం. ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13న అని జక్కన్న ప్రకటించారో లేదో…లవ్ స్టోరి ఏప్రిల్ 16న వస్తుందని చెప్పేసారు శేఖర్ కమ్ముల. ఇదే రోజున నాని టక్ జగదీష్ కూడా విడుదలకానుంది. ఇక బాక్సర్ గా వరుణ్ తేజ్ జూలై 30న వస్తుంటే…పుష్పగా బన్నీ ఆగస్టు 13న రానున్నారు. సో ఇలా ఈ సంవత్సరమంతా పెద్ద సినిమాలతో థియేటర్లు కళకళలాడనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *