‘క్రికెట్ కింగ్ హర్భజన్ సింగ్, యాక్షన్ కింగ్ అర్జున్’ కలయికలో… 25 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తమిళంలో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ “ఫ్రెండ్ షిప్“. ‘జాన్ పాల్ రాజ్-శ్యామ్ సూర్య’ కలిసి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాని “ఫ్రెండ్ షిప్” టైటిల్ తోనే.. ‘సింగ్ అండ్ కింగ్’ అనే ట్యాగ్ లైన్ యాడ్ చేసి.. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ పై ఏ.ఎన్. బాలాజీ తెలుగులో విడుదల చేయబోతున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ లాస్ట్ షెడ్యూల్ కోయంబత్తూర్, ఊటీలలో షూటింగ్ చేస్తున్నారు. మాజీ ‘మిస్ శ్రీలంక’ తమిళ్ బిగ్ బాస్ విన్నర్ ‘లోస్లియా’ ఇందులో హీరోయిన్. ప్రముఖ తమిళ్ ప్రొడ్యూసర్ జె.సతీష్ కుమార్ విలన్ గా కనిపించబోతున్న ఈ చిత్రం టీజర్ రీసెంట్ గా రిలీజైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *