రొమాంటిక్ కామెడీ మూవీ ‘ఎఫ్‌సీయూకే’లో తండ్రిగా నటిచిన జగపతిబాబు సోషల్ మీడియాలో ఏసుక్రీస్తుగా కనిపిస్తున్నారు. ట్విట్టర్ లో యాక్టివ్‌గా ఉండే జగ్గూభాయ్ త‌న సినిమా విశేషాల‌ను అప్పుడప్పుడు షేర్ చేస్తుంటారు. రీసెంట్ గా చేతుల‌కు శిలువ‌, నెత్తిన ముళ్లకిరీటం, బక్కచిక్కిన శరీరంతో ట్విట్టర్ లో దర్శనమిచ్చారు. అయితే ఈ ఫోటోతో పాటూ ఎలాంటి కామెంట్ చేయలేదు. ఏదైనా సినిమాలో ఏసుగా నటిస్తున్నారా…వేరే కారణం ఏదైనా ఉందా అన్నది అభిమానులకి అర్ధం కావట్లేదు. దీంతో క్లారిటీ ఫ్లీజ్ స‌ర్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.

ఒక‌ప్పుడు ఫ్యామిలీ ప్రేక్ష‌కుల‌ని టార్గెట్ చేసిన జ‌గ‌ప‌తి బాబు వివిధ రకాల క్యారెక్టర్స్ చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్నారు. విలన్ గా, అన్నయ్యగా, తండ్రిగా… ఇలా ప్రత్యేకమైన పాత్ర‌లు చేస్తూ కాల్ షీట్స్ ఖాళీలేకుండా గడుపుతున్నారు. ప్ర‌జెంట్ ‘ఎఫ్‌సీయూకే’ (ఫాదర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌) సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు. విద్యాసాగ‌ర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రామ్‌ కార్తీక్‌, అమ్ము అభిరామి ప్రధాన పాత్ర‌ల్లో నటించారు. కాగా ఈ సినిమాని ఫిబ్ర‌వ‌రి 12న రిలీజ్ చేయ‌నున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *