అందాలరాశి శ్రీదేవి త‌న‌య జాన్వీ క‌పూర్ తొలి సారి థ్రిల్లర్ ప్రాజెక్ట్ తో మనముందుకు రాబోతుంది. రూహి అనే పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్వీతో పాటే రాజ్ కుమార్ రావు కీలక పాత్రల నటించారు. వ‌రుణ్ శర్మ, పంకజ్ త్రిపాఠి వంటివారు మరికొన్ని పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఇందులో జాన్వీ…దెయ్యంగా భయపెట్టడం విశేషం. చూస్తుంటే నటనతో బాగానే ఆకట్టుకునేలా ఉంది జాన్వీ. మార్చి 11న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. రీసెంట్ గా రూహీ ట్రైల‌ర్ విడుద‌ల చేసారు. ట్రైలర్ చూస్తుంటే కామెడీతో పాటూ ఒళ్లు గగుర్పొడిచేలా డైరెక్టర్ చిత్రీకరించినట్టు తెలుస్తోంది. డైరెక్టర్ హార్దిక్ మెహతా ఈ కామెడీ థ్రిల్లర్ తో గట్టి సక్సెస్ సాధిస్తాడనే నమ్మకంతో ఉన్నారు.
గతంలో రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ కలిసి నటించిన మూవీ స్త్రీ. ఈ చిత్రానికి సీక్వెల్ గానే రూహిని రూపొందించినట్టు టాక్. మొదట్లో రూహీ అఫ్జానా అనే టైటిల్ ఈ ప్రాజెక్ట్ కి ఫిక్స్ చేయ‌గా, దానిని ప్రజెంట్ రుహిగా మార్చారు. గతేడాది రూహీ రిలీజ్ కావాల్సింది కానీ క‌రోనా కారణంగా వాయిదా ప‌డింది. మొత్తానికి మార్చి 11న భయపెట్టేందుకు సిద్ధమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *