నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ హీరోగా వరుస హిట్స్ అందుకుంటున్న ప్ర‌ముఖ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేక‌ర్స్ పతాకంపై సరికొత్త చిత్రం రీసెంట్ గా మొదలయింది. కథానాయకుడిగా కల్యాణ్ రామ్ 19వ సినిమా ఇది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ ప్రొడక్షన్ నెం.14గా తెరకెక్కబోతున్న ఈ మూవీతో డెబ్యూ డైరెక్టర్ రాజేంద్ర ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రొడ్యూసర్స్ నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్.

ముహూర్తపు సన్నివేశానికి బుచ్చిబాబు సానా క్లాప్ కొట్టారు. ద‌ర్శ‌కులు భ‌ర‌త్ క‌మ్మ, రాధాకృష్ణ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. హీరో క‌ల్యాణ్ రామ్‌, నిర్మాత న‌వీన్ ఎర్నేని, సీఈఓ చెర్రీ .. చిత్ర ద‌ర్‌ కుడు రాజేంద్ర‌కు స్క్రిప్ట్ అందించారు. మార్చి రెండో వారం నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. సినిమాలో హీరోయిన్ స‌హా ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ ప్రకటించింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *