కార్తీకేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం చావు కబురు చల్లగా. ఈ సినిమాలో అనసూయ పైన పటారం అంటూ కార్తీకేయతో స్టెప్పులేసిన ఓ ఐటం సాంగ్ ప్రోమో రిలీజైంది. కాగా ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫస్ట్ గ్లింప్స్, టీజర్, లిరికల్ వీడియో సాంగ్స్…ఈ సినిమా నుంచి ఏది రిలీజైనా…పాజిటివ్ రెస్పాన్స్ దక్కుతుండటం విశేషం.
‘చావు కబురు చల్లగా’ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా బన్నీ వస్తున్నట్టు సమాచారం. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో నిర్మితమైన సినిమా అనే కాకుండా కార్తికేయ కోసం అల్లు అర్జున్ ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్. అతిత్వరలో నిర్వహించబోయే చావు కబురు చల్లగా ప్రీరిలీజ్ ఫంక్షన్ కోసం అల్లు అర్జున్ డేట్ ఫిక్స్ చేసుకున్నారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ పరివారం మొత్తం ఈ వేడుకకు రానున్నారట. చూస్తుంటే కార్తీకేయ ఇన్నాళ్లకు గ్రాండ్ వెల్కమ్ లభించేలా కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *