సరికొత్త కథాంశంలో కార్తికేయ, లావణ్య త్రిపాఠి నటిస్తోన్న “చావు క‌బురు చ‌ల్ల‌గా ” మూవీ నుంచి తొలి పాట మై నేమ్ ఈజ్ రాజు విడుద‌లైంది. మెగా నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌రుస విజయాలతో దూసుకుపోతున్న ‌బన్నీ వాసు నిర్మాత‌గా డెబ్యూ డైరెక్టర్ కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి రూపొందిస్తున్న చిత్రం ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’. ‌ఆల్రెడీ విడుదలైన మూవీ టైటిల్.. హీరో కార్తికేయ ‘బ‌స్తి బాల‌రాజు’ గెటప్ ఫ‌స్ట్ లుక్, ఇంట్రోకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆ త‌ర్వాత వరుసపెట్టి విడుదలచేస్తున్న హీరో క్యారెక్ట‌రైజేషన్ వీడియో, లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్ తో పాటూ మూవీ టీజ‌ర్ గ్లిమ్ప్స్ కి అనూహ్య స్పందన లభించింది

మార్చి 19న భారీ స్థాయిలో సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజాయ్ కంపోజ్ చేసిన మై నేమ్ రాజు అంటూ హీరో కార్తికేయ బస్తీ బాలరాజుగా సందడి చేస్తున్న ఇంట్రో సాంగ్ రీసెంట్ గా రిలీజైంది. ఈ పాటని సింగర్ రేవంత్ పాడ‌గా, క‌రుణాక‌ర్ అడిగ‌ర్ల సాహిత్యాన్ని సమకూర్చారు. ఇప్పటికే సినిమాకు వస్తోన్న ట్రెమండస్ రెస్పాన్స్ బట్టి ఇప్పుడు మై నేమ్ రాజు పాట కూడా ప్రేక్షకులని అలరిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు దర్శకనిర్మాతలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *