డిసెంబరు 21 అనగానే కేజీఎఫ్ ఫ్యాన్స్ కి గుర్తొచ్చేది రిలీజ్ డేట్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యశ్‌ హీరోగా తెరకెక్కిన ప్యాన్‌ ఇండియా చిత్రం ‘కేజీఎఫ్‌’ విడుదలైంది…2018 డిసెంబర్‌ 21న. ఆ రోజున ఏ ముహూర్తాన తెరపై సినిమా పడిందో కానీ ఘన విజయం సాధించటమే కాదు యశ్‌కు సూపర్ పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఆ క్రేజ్ కారణంగానే ఆ సినిమాకి సీక్వెల్‌గా ‘కేజీఎఫ్‌-2’ తెరకెక్కుతోంది. గతేడాది డిసెంబర్‌ 21న ‘కేజీఎఫ్‌-2’ నుంచి యశ్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసారు. ఈ ఏడాది ఇదే రోజున సీక్వెల్ ను సైతం రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే కరోనా కారణంగా గ్యాప్ రావడంతో అది కుదరలేదు. కానీ డేట్ సెంటిమెంట్ ను వదిలే ప్రసక్తే లేదంటుంది చిత్రయూనిట్.

మరోసారి కూడా సెంటిమెంట్‌ను రీపీట్‌ చేసేందుకు సిద్దమవుతోంది. తమకి ఎంతో కలిసొచ్చిన డిసెంబర్‌ 21న ప్రేక్షకులకు ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ ఓ ట్వీట్‌ చేసారు. ‘కేజీఎఫ్‌-2’ ముగింపుకు మేము చేరువలో ఉన్నాం. ప్రతి సంవత్సరం డిసెంబర్‌ 21న అభిమానుల్ని సర్‌ప్రైజ్‌ చేసిన మేము ఈ ఏడాది కూడా అదే ఆచారాన్ని కొనసాగించేందుకు రెడీ అవుతున్నాం. మా అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల వేదికగా.. డిసెంబర్‌ 21న ఉదయం 10.08 గంటలకు… స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నాం. సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నందుకు కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. రాకీభాయ్‌ ఇచ్చే స్పెషల్‌ సర్‌ప్రైజ్ ఏంటో తెలియాలంటే కొంత సమయం ఆగాల్సిందే. ఇక ఈ చిత్రంలో పవర్ ఫుల్ విలన్ గా అధీరా పాత్రలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో రవీనా టాండన్‌, ప్రకాశ్‌ రాజ్‌, శ్రీనిధి శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *