వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి నటించిన ఉప్పెన ఫిబ్రవరి 12న రిలీజ్ కానుంది. అయితే విడుదలకు ముందే కాల్షీట్స్ ఖాళీ లేకుండా చేసుకుంటోంది హీరోయిన్ కృతిశెట్టి. మొన్న ప్రీరిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి అన్న మాటలు అక్షరాల నిజమవుతున్నాయి. ఈ అమ్మాయి డేట్స్ ఇప్పుడే బుక్ చేసుకోండి…లేదంటే మీకు దొరక్కపోవచ్చు అని కామెంట్ చేసారు చిరూ. దానికి తగ్గట్టే ప్రస్తుతం కృతి జపం చేస్తున్నారు దర్శకనిర్మాతలు. దాదాపు సంవత్సరం నుంచి వినిపిస్తోన్న పాటలు, ఫస్ట్ లుక్, టీజర్స్ నుంచి రీసెంట్ ట్రైలర్ వరకు కృతిశెట్టిని చూసిన కుర్రకారు దాసోహం అంటోంది.

ఇప్పటికే నాని శ్యామ్ సింగ రాయ్ మూవీతో పాటూ మోహనకృష్ణ ఇంద్రగంటి, సుధీర్ బాబు కాంబో చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది కృతిశెట్టి. కాగా తాజాగా అక్కినేని వారసుడితో నటించే ఛాన్స్ కొట్టేసింది. అక్కినేని అఖిల్ సరసన కృతిశెట్టి నటించబోతుందనే వార్త ప్రస్తుతం ప్రచారంలో ఉంది. అయితే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ నటించబోతున్న సినిమాలోనా, వేరే ప్రాజెక్ట్ లోనా అన్నది తెలియాల్సిఉంది. ఎందుకంటే సురేందర్ రెడ్డి మూవీలో వైద్యాసాక్షి అనే కొత్తమ్మాయిని పరిచయం చేస్తున్నారని ఇప్పటికే వార్తలొచ్చాయి. మరి ఆ భామని కృతిశెట్టితో రీప్లేస్ చేస్తున్నారా అన్నది మరికొన్ని రోజుల్లో తెలియనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *