మెగాస్టార్ లూసీఫర్ రీమేక్ గురించి రోజుకో వార్త హల్చల్ చేస్తుంది. నయనతార చిరూ చెల్లెలిగా, సత్యదేవ్ మరో పాత్రలో కనిపిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే వీటి గురించి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అని తెలిసింది. స్వయంగా లూసీఫర్ రీమేక్ కు సంగీతం సమకూర్చబోయేది నేనే అని ప్రకటించాడు తమన్. ‘ప్రతి సంగీత దర్శకుడికి ఇది ఓ పెద్ద కల…ఇప్పుడు నా వంతు రానేవచ్చింది…మెగాస్టార్ పై నాకున్న అభిమానాన్ని నా మ్యూజిక్ తో తెలియజేస్తాను’ అని మురిసిపోయాడు తమన్.
అయితే ఈ మూవీకి సంబంధించి చాలామంది డైరెక్టర్ల పేర్లు తెరపైకొచ్చినా చివరికి… ఆ ఛాన్స్ ‘తనిఒరువన్‌’ మేకర్ మోహన్‌రాజాకు దక్కింది. మోహన్‌రాజా తీర్చిదిద్దిన రీమేక్‌ వెర్షన్‌ బాగా నచ్చడంతో.. వెంటనే చిరు డైరెక్టర్‌ను ప్రకటించారు. జనవరి చివరివారం నుంచి ఈ సినిమా సెట్స్ పైకెళ్లనుందని.., ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలల్లో బిగ్ షెడ్యూల్ ప్లాన్‌ చేస్తున్నట్టు అధికారికంగా తెలియజేసారు. ఇక ఇప్పుడు తాజాగా మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్ కూడా సిద్ధమయ్యాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *