మరో క్రేజీ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ప్రభాస్ కి పోటీగా మహేశ్ బరిలోకి దిగుతున్నాడన్న వార్త ప్రెజెంట్ హాట్ టాపిక్ గా మారింది. ఒకటే వేషం ఈ ఇద్దరు వేస్తే ఎలా ఉంటుంది? కథ ఒకటే…రెబల్ స్టార్, సూపర్ స్టార్ లను వేరు వేరు వర్షన్స్ లో చూస్తే ఎలా ఉంటుంది?

రామాయణం…ఎన్ని సినిమాల్లో రాముని గాధను చూసినా బోర్ కొట్టని సబ్జెక్ట్. ఈ కథాంశాన్ని ఆధారంగా చేసుకునే ప్రభాస్ ఆదిపురుష్ తెరకెక్కుతోంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ 3డీ టెక్నాలజీతో పాన్ ఇండియా లెవల్లో రూపొందిస్తున్నాడు. సగానికి పైగా ఆదిపురుష్ షూటింగ్ ను గ్రీన్ మ్యాట్ లోనే షూట్ చేయనున్నారు. కృతీ సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడీ ప్రాజెక్ట్ కి పోటీగా మహేశ్ బాబు..దీపికా పదుకునే, హృతిక్ రోషన్ లతో కలిసి రంగంలోకి దిగనున్నాడనే వార్త హాట్ టాపిక్ గా మారింది.

ఆదిపురుష్ సినిమాకు పోటీ అన్నట్టు సూపర్ స్టార్ తో రామాయణం సినిమాని త్రీడీ ఫార్మెట్ లో ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అది కూడా 300కోట్ల భారీ బడ్జెట్ తో. ప్రముఖ నిర్మాత మధు మంతెన చాలాకాలం నుంచే రామాయణాన్ని రూపొందించడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ముందుగా ప్రభాస్ నే హీరోగా అనుకున్నా…ఆయన ఆదిపురుష్ కి కమిట్ అవడంతో నిర్ణయాన్ని మార్చుకున్నారు. తాజాగా మహేశ్ బాబుని…రామునిగా చూపించేందుకు ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం మహేశ్, నిర్మాత మధుల మధ్య చర్చలు నడుస్తున్నాయి.

మహేశ్ బాబును రాముడిగా నటింపజేసేందుకు ట్రై చేస్తోన్న ఆ ప్రాజెక్ట్ లోనే… రావణుడి పాత్ర కోసం హృతిక్ రోషన్ ని.. దీపికా పదుకొనేని సీత పాత్ర కోసం సంప్రదిస్తున్నారు. అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్ర నిర్మాతలుగా గత మూడేళ్లుగా ఈ ప్రాజెక్ట్ గురించి చర్చలు సాగుతూనే ఉన్నాయి. ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారి ‘మామ్’ ఫేమ్ రవి ఉద్యవార్ దర్శకత్వంలో ‘రామాయణం’ మూవీని అధికారికంగా ప్రకటించారు కూడా. కానీ అనుకోని కారణాలతో డిలే అయిన ఈ ప్రాజెక్ట్… రీసెంట్ గా మహేశ్ బాబు, దీపికా పదుకోన్, హృతిక్ రోషన్ పేర్లతో మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *