సూపర్ స్టార్ మహేశ్ బాబు సర్కారు వారి పాట వచ్చే ఏడాదికి సంక్రాంతికి సీట్ బుక్ చేసుకుంది. 2022 సంక్రాంతి పోరులో తలపడేందుకు ముందే జెండా పాతాడు మహేశ్ బాబు. నిజానికి ఈ దసరాకే ఈ సినిమా వస్తుందనుకున్నారు. కానీ 2021 డిసెంబరులో ముహూర్తం పెట్టుకున్న ఈ ప్రాజెక్ట్ ఇటీవలే దుబాయ్ లో తొలి షెడ్యూల్ ప్రారంభించింది. ఎంత వేగంగా చేసినా హడావుడీ అవుతుందే తప్ప అవుట్ పుట్ సరిగా రాదని భావించిన మేకర్స్ సర్కారు వారి పాటను సంక్రాంతికి వాయిదావేసినట్టు తెలుస్తోంది.

దసరాకు ఆర్ఆర్ఆర్ బరిలోకి దిగుతోంది. రీసెంట్ గా రాజమౌళి తన సినిమా అక్టోబరు 13న వస్తుందని ప్రకటించారు. దీంతో పోటీ అనవసరం అనుకొని సంక్రాంతికి వాయిదా వేసారేమో తెలియదు కానీ 2022 జనవరి వరకు తన అభిమానులను వెయిట్ చేయమంటున్నారు మహేశ్ బాబు. కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తోన్న సర్కారు వారి పాటను పరశురామ్ డైరెక్ట్ చేస్తున్నారు. సునీల్ శెట్టి విలన్ గా కనిపించే అవకాశం ఉంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఆర్థిక నేరాలు, బ్యాంక్ స్కాముల కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *