అటు మెగాస్టార్…ఇటు పవర్ స్టార్…టోటల్ గా మెగా ఫ్యాన్స్ కు అంతకన్నా మెగా ట్రీట్ ఇవ్వబోతున్నారు ఆచార్యా టీమ్. చిరంజీవి డాన్స్ అంటేనే కామన్ గా పిచ్చెక్కిపోతారు ఫ్యాన్స్. అటువంటిది. ఆచార్యాలో.. మెగాస్టార్-పవర్ స్టార్ కలిసి సాంగ్ చేయబోతున్నారు. ఈ పాటతో సినిమాను హీటెక్కించబోతున్నారనే టాక్ నడుస్తోంది. అయితే ఇదే పాటలో రామ్ చరణ్ కూడా ఉంటాడని టాక్.
శంకర్ దాదా జిందాబాద్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్…చిరంజీవి సినిమాలో కనిపించబోతున్నారు. ఈ అన్నదమ్ముల కాంబినేషన్లో మల్టీస్టారర్ సాధ్యపడలేదు. కానీ దాదాపు చిరూ, చరణ్ మల్టీస్టారర్ ఆచార్య అని ప్రకటించిన కొరటాల శివ డైరెక్షన్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ డాన్స్ వేయడం నిజంగా విశేషమే. వకీల్ సాబ్ పూర్తైన తర్వాత క్రిష్ కాంబో మూవీతో పాటూ..రానాతో కలిసి చేస్తున్న మలయాళీ రీమేక్ షూటింగ్స్ తో తీరికలేకుండా గడుపుతున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడిలా అన్నయ్య సినిమాలో మెరిసేందుతు సై అన్నరన్నమాట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *