నందమూరి అభిమానులకు పండగే పండుగ. ఉప్పెన ప్రమోషన్స్ లో భాగంగా మైత్రీ మూవీ మేకర్స్ తమ తదుపరి సినిమాల గురించి అధికారిక ప్రకటన చేసాయి. అయితే అవి నందమూరి అందగాళ్ల సినిమాలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాలయ్య బాబుతో ఒక సినిమా, ఎన్టీఆర్ తో మరొక సినిమాను తెరకెక్కించబోతున్నట్టు స్పష్టం చేసారు నిర్మాతలు.

మాస్‌ఫ్యాన్స్ ను ఖుషీ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు నందమూరి బాలకృష్ణ. మరోవైపు రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘క్రాక్‌’తో మాస్ ప్రేక్షకులను ఆకర్షించారు గోపీచంద్‌మలినేని. క్రాక్ తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బాలయ్య సినిమా ఉంటుందనే వార్తలు బాగా చక్కర్లు కొట్టాయి. కాగా ఈ న్యూస్ నిజమేనని ప్రకటించారు మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్… రవిశంకర్‌, నవీన్. వీళ్లిద్దరి కాంబో మూవీని తమ బ్యానర్‌పై నిర్మిస్తున్న సంగతి నిజమేనని స్పష్టం చేసారు. ప్రజెంట్ గోపీచంద్‌ స్ర్కిప్ట్‌ వర్క్ లో ఉన్నారని.. బాలయ్య-బోయపాటి మూవీ అయిన వెంటనే తమ ప్రాజెక్ట్‌ ప్రారంభమవుతుందని తెలియజేసారు.

ప్రశాంత్ నీల్… ‘కేజీఎఫ్‌’ చాప్టర్స్ తో ప్రపంచవ్యాప్త గుర్తింపును సంపాదించిన దర్శకుడు. తారక్‌తో ఆయన ఓ సినిమా చేయనున్నారంటూ చాలారోజుల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ అధికారికంగా ఎవరూ ధృవీకరించలేదు. అయితే, ‘సలార్‌’ తర్వాత ఎన్టీఆర్‌ – ప్రశాంత్‌నీల్‌ కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఓ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని తెలిపారు ప్రొడ్యూసర్ నవీన్. ఇదిలావుంటే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్ తో కలిసి ఓ సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్‌. ఇప్పుడిలా తమ అభిమాన హీరోకి సంబంధించిన మరో క్రేజీ న్యూస్ రావడంతో ఖుషీ అవుతున్నారు ఫ్యాన్స్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *