వరుస సినిమాలతో దూసుకుపోవడమే కాదు….అవసరమైతే హెచ్చరించడానికి సైతం వెనుకాడలేదు టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ. ఎవరికో కాదు తనని సోషల్ మీడియాలో ఫాలో అయ్యే నెటిజన్లకు వార్నింగ్ ఇచ్చింది మైత్రీ మూవీ మేకర్స్. అసభ్య పదజాలంతో ట్వీట్స్ పెడితే బ్లాక్‌ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ‘ఉప్పెన’తో 2021 ఆరంభంలోనే సూపర్ సక్సెస్ ని సొంతం చేసుకుంది మైత్రిమూవీ మేకర్స్‌. ప్రస్తుతం ఈ సంస్థ ఖాతాలో పెద్ద పెద్ద హీరోలు నటిస్తోన్న…నటించబోతున్న భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దీంతో సినీఅభిమానుల చూపు మైత్రి ప్రొడక్షన్స్ వైపే ఉంది. తమ ఫేవరెట్ హీరోల సినిమా కబుర్ల అప్‌డేట్స్ కోరుతూ ప్రేక్షకులు మైత్రి మూవీస్‌ సంస్థకు ట్వీట్స్ కూడా చేస్తున్నారు. అయితే, కొందరు ఆకతాయిలు మాత్రం అసభ్యపదాలను వాడుతూ కామెంట్స్ కొడుతున్నారు. అందుకే హెచ్చరిస్తూ ట్వీట్ చేయాల్సివచ్చింది మైత్రి మూవీ మేకర్స్‌ వారికి. ‘అసభ్య పదాలతో ట్వీట్స్ చేసే ఆకతాయిల అకౌంట్స్ ఇక నుంచి బ్లాక్‌ చేస్తాం. హ్యాపీ సోషల్‌ మీడియా స్పేస్‌ కోసం అందరం చేతులు కలుపుదాం’ అంటూ తెలియజేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *