ఈరోజు యంగ్ డైనమిక్ నాగశౌర్య పుట్టినరోజు. వారం ముందు నుంచే కొత్త సినిమా అప్ డేట్స్ తో రచ్చ చేస్తున్నారు ఈ బర్త్ డే బాయ్. తాజాగా వరుస టీజర్స్ తో కుమ్మేస్తున్నారు. మొదట ఎనర్జిటిక్ వరుడిగా ‘వరుడు కావలెను’ టీజర్ తో ఆకట్టుకున్నారు. డెబ్యూ లేడీ డెరైక్టర్ లక్ష్మీ సౌజన్య డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రీతూవర్మ హీరోయిన్ గా నటిస్తోంది. నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్ వంటి వారు ప్రధానపాత్రల్లో కనిపించనున్నారు.
‘లక్ష్య’ సినిమాలో సరికొత్తగా కనిపిస్తున్నారు నౌగశౌర్య. బాడీ మేకోవర్ తో విలువిద్యను ప్రదర్శిస్తున్నారు. జగపతిబాబు వాయిస్ ఓవర్ తో రిలీజైన ఈ మూవీ టీజర్…సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. కేతికశర్మ హీరోయిన్ కాగా…ధీరేంద్ర సంతోష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్నారు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది.
‘ఫలనా అబ్బాయి…ఫలనా అమ్మాయి’ అంటూ శౌర్య మరో క్రేజీ ప్రాజెక్ట్ తో రంగంలోకి దిగారు. షూటింగ్ లోకేషన్ విజువల్స్ తో చిన్న టీజర్ ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్. అవసరాల శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్నారీ చిత్రాన్ని. ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద వంటి హిట్ సినిమాల తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న ప్రాజెక్ట్ ఇది. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.
ఇవే కాదు ‘పోలీసు వారి హెచ్చరిక’తో పాటూ మరో క్రేజీ ప్రాజెక్ట్ ను త్వరలోనే పట్టాలెక్కించబోతున్నారు నాగశౌర్య. మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ జోష్ మీదున్నారు బర్త్ డే బాయ్. 2021లో మొదలుపెడితే 2022 వరకు నావే రిలీజ్ లు అనేలా ఊపుమీదున్నారు. ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ బర్త్ డే నాగశౌర్య.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *