వరుడు కావలెను తో క్లాసిక్ లుక్ లో దర్శనమిచ్చిన నాగశౌర్య…కొత్త సంవత్సర సందర్భంగా లక్ష్యతో మరో లుక్ ను ప్రజెంట్ చేసాడు. ఈ యంగ్‌ హీరో హీరోగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `ల‌క్ష్య` . కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో ఒక కీల‌క పాత్ర‌లో విలక్షణ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు న‌టిస్తున్నారు. నాగ‌శౌర్య 20వ చిత్రంగా ప్రాచీన విలువిద్య నేప‌థ్యంలో స్పోర్ట్స్ బేస్డ్ ఫిలింగా అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఇప్ప‌టికే 70% షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా చివ‌రిషెడ్యూల్ ఈ నెల 4 నుండి ప్రారంభంకానుంది. కాగా నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌ల‌తో  స‌రికొత్త పోస్ట‌ర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్‌. నాగ‌శౌర్య కుడి చేతికి క‌ట్టు క‌ట్టుకుని ఇంటెన్స్ లుక్‌లో  ఉన్న ఈ పోస్ట‌ర్  సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.

ఈ మూవీ నుండి ఇప్ప‌టికే విడుద‌ల‌చేసిన స్ట‌న్నింగ్‌ ఫస్ట్‌లుక్ అంద‌రినీ థ్రిల్ చేసింది. `ది గేమ్ విల్ నెవ‌ర్ బీ ద  సేమ్’ అంటూ ఎయిట్‌ ప్యాక్ బాడీతో చేతిలో బాణం ప‌ట్టుకుని వారియ‌ర్ పోజ్ లో నాగ‌శౌర్య ఉన్న లుక్ సూప‌ర్బ్ అన్నారందరూ. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *