నాగార్జున హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘బంగార్రాజు’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ ఫిల్మ్ షూటింగ్ వచ్చే నెల 16న ప్రారంభించి సింగిల్ షెడ్యూలులో పూర్తిచేయాలని ప్లాన్ చేస్తున్నారట. నాగ్ న‌టించిన సోగ్గాడే చిన్ని నాయ‌న బాక్సాపీస్ వ‌ద్ద ఘన విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. 2015 సంక్రాంతికి రిలీజై మంచి వ‌సూళ్ల‌ను రాబట్టింది. ఈ సినిమాలో నాగార్జున పోషించిన‌ బంగార్రాజు పాత్ర  ప్రేక్ష‌కుల హృద‌యాల్లో ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంది. క‌ళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్టుకు సీక్వెల్ వ‌స్తుంద‌ని గ‌తంలోనే నాగ్ క్లారిటీ ఇచ్చాడు. అయితే ప‌లు కార‌ణాల వ‌ల్ల ఇది వాయిదా ప‌డుతూ వచ్చింది.

తాజా స‌మాచారం మేర‌కు బంగార్రాజు చిత్ర షూటింగ్ జ‌న‌వ‌రి 16 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనున్న‌ట్టు స‌మాచారం. సింగిల్ షెడ్యూల్‌లో మూవీని అత్యంత తొందరగా పూర్తి చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తుంద‌ట‌. బంగార్రాజులోని కీల‌క పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ న‌టిస్తుండ‌గా హీరోయిన్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *